English   

ఖాన్స్ తో యుద్ధానికి దిగుతున్న ప్ర‌భాస్.. 

Prabhas-In-A-Fight-with-Bollywood-Khans
2017-05-10 11:01:39

బాహుబ‌లితో ప్ర‌భాస్ జాత‌కం మారింద‌ని తెలుసు. కానీ మ‌రీ ఇంత‌లా ట‌ర్న్ అవుతుంద‌నీ ఆయ‌న కూడా ఊహించి ఉండ‌డు. బాహుబ‌లి అనే ఒక్క సినిమాతో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిపోయాడు ప్ర‌భాస్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్.. ఇలా ఇండియాలోని అన్ని దిక్కుల్లోనూ ఇప్పుడు ప్ర‌భాస్ సూప‌ర్ స్టార్. బాలీవుడ్ లో అయితే ఒక్క రికార్డు కూడా మిగ‌ల్చ‌కుండా అన్ని ఊడ్చేసాడు ప్ర‌భాస్. అలాంటి హీరోను ఉత్త‌రాది ద‌ర్శ‌కులు ఎందుకు వ‌దిలేస్తారు. అందుకే ఇప్పుడు ప్ర‌భాస్ తో బాలీవుడ్ సినిమా చేయించ‌డానికి అక్క‌డ్నుంచి పావులు క‌దుపుతున్నాడు క‌ర‌ణ్ జోహార్. బాలీవుడ్ లో బాహుబ‌లి సినిమాను ఆ స్థాయికి తీసుకెళ్లింది ఆయ‌నే.

ఇక ఇప్పుడు బాహుబ‌లి తెచ్చిన ఇమేజ్ క్యాష్ చేసుకుంటూ.. ప్ర‌భాస్ తో సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ తో రెండు సినిమాలు చేయ‌డానికి క‌ర‌ణ్ జోహార్ డీల్ కుదుర్చుకున్నాడ‌ని తెలుస్తోంది. ఇక‌పై చేయ‌బోయే సినిమాల‌న్నీ తెలుగుతో పాటు హిందీలోనూ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్ర‌భాస్. బాహుబ‌లితో వ‌చ్చిన ఇమేజ్ అంత ఈజీగా వ‌దిలేయ‌కూడ‌ద‌నేది ప్ర‌భాస్ ఆలోచ‌న‌. అన్నీ కుదిర్తే తెలుగు సినిమాల కంటే ఎక్కువ‌గా బాలీవుడ్ పైనే ఫోక‌స్ చేయాల‌ని చూస్తున్నాడు. ప్ర‌స్తుతం సుజీత్ సాహోతో పాటు రాధాకృష్ణ‌తో సినిమా క‌మిట‌య్యాడు ప్ర‌భాస్. ఈ రెండు సినిమాలు తెలుగుతో పాటు హిందీలోనూ అనువాదం అవుతాయి. మ‌రి ఆ త‌ర్వాత ప్ర‌భాస్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలిక‌..!

More Related Stories