English   

 ప్రభాస్ ముద్దుపెట్టిన అమ్మాయి ఎవరు..?

prabhas-saaho
2018-06-29 09:59:37

డార్లింగ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏం చేసినా వైరల్ అవుతోంది. లెటెస్ట్ గా ప్రభాస్ ఓ అమ్మాయికి పబ్లిగ్గా ముద్దుపెట్టాడు. ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిప్పుడు. ప్రభాస్ మామూలుగానే జెంటిల్ గా బిహేవ్ చేస్తాడు. అసలే పెళ్లి కావాల్సిన వాడు.. అమ్మాయి కోసం వెదుకుతున్నవాడు..  అలాంటిది ఓ లేడీ బుగ్గలపై ముద్దుపెట్టడం.. అది ఫోటోలు తీయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అంతా కొత్తగా అనిపిస్తోంది. దీంతో అసలు ప్రభాస్ ముద్దుపెట్టిన లేడీ ఎవరా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు నెటిజన్స్.. ఫైనల్ గా తనెవరో తెలిసిపోయింది. 

ప్రభాస్ పబ్లిగ్గా ముద్దుపెట్టిన అమ్మాయి బాలీవుడ్ ఫెమస్  మేకప్ ఆర్టిస్ట్ . తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అందుకే అతన్ని పర్సనల్ గా కలిసింది. పైగా బాలీవుడ్డోల్లు మరీ ఫాస్ట్ కదా.. అందుకే ఆ కల్చర్ ప్రభాస్ కూ త్వరగానే వచ్చినట్టుంది. ఈ కారణంగానే క్యాజువల్ గా ఆమె బుగ్గలపై అధర చుంబనం వేశాడు. ఇదంతా అక్కడ కల్చర్ లో చాలా లైట్ గా తీసుకునే వ్యవహారం. కానీ మనదగ్గర అది చాలా వెయిట్ ఉన్న వార్తగా మారుతుంది కదా.. అందుకే ప్రభాస్ ముద్దుపెట్టిన అమ్మాయొవరా..? అని తెగ ఇదైపోతున్నారు జనం. సో.. మేటర్ వెరీ సింపుల్.. ఆమె ప్రభాస్ సినిమాకు పనిచేస్తోన్న ఓ టెక్నీషియన్ దట్సాల్.. 

More Related Stories