English   

ప్ర‌భాస్ కు ఆ భామ‌ను సెట్ చేసిన ఫ్యాన్స్.. 

Prabhas-ku-A-Bhamanu-Set-Chesina-Fans
2017-05-10 09:17:58

ప్ర‌భాస్ బాహుబ‌లి ఫీవ‌ర్ నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌టికి వ‌స్తున్నాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగేళ్ల పాటు ఆ గెట‌ప్ లో ఉన్నాడు క‌దా.. ఇంకా ఆ మాయ‌లోనే ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఈ మ‌ధ్యే సినిమా విడుద‌లైన త‌ర్వాత కొన్ని రోజులు ప్ర‌మోష‌న్ లో పాల్గొన్న ప్ర‌భాస్.. ఇప్పుడు ఎంచ‌క్కా అబ్రాడ్ వెళ్లిపోయాడు. అక్క‌డే నెల రోజులు ఫుల్ గా ఎంజాయ్ చేసి రానున్నాడు ప్ర‌భాస్. ఆ త‌ర్వాతే సాహో షూటింగ్. అయితే హీరో ఎంజాయ్ చేస్తున్నా.. ద‌ర్శ‌కుడు సుజీత్ మాత్రం ఓ టెన్ష‌న్ లో ఉన్నాడు. అదే ప్ర‌భాస్ కు హీరోయిన్ వేట‌. ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల‌, హిందీల్లోనూ తెర‌కెక్కుతుండ‌టంతో సాహోలో అనుష్క శ‌ర్మ‌ను హీరోయిన్ గా తీసుకోవాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఫ్యాన్స్ మాత్రం త‌మ హీరోకు క‌త్రినా అయితే క‌త్తిలా ఉంటుంద‌ని ఫీల‌వుతున్నారు.

ఇప్ప‌టికే ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్ ఒక‌టి విడుద‌ల చేసారు. అందులో ఓ వైపు క‌త్రినా.. మ‌రోవైపు అనుష్క శెట్టి ఫోటోలున్నాయి. చూస్తుంటే ప్ర‌భాస్ కూడా ఈ పోస్ట‌ర్ చూసిన త‌ర్వాత క‌త్రినా వైపు అడుగేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎందుకంటే ప్ర‌భాస్ హైట్ కు క‌త్రినా ప‌ర్ ఫెక్ట్ గా సూట‌వుతుంది. పైగా బాలీవుడ్ హీరోయిన్లు ఇంత‌కు ముందు అయితే నో చెప్పేవాళ్లేమో గానీ ఇప్పుడు ప్ర‌భాస్ రేంజ్ తెలిసిన త‌ర్వాత నో చెప్పే కార‌ణం అయితే లేదు. పైగా ప్ర‌భాస్, క‌త్రినా జోడీ కూడా బాగానే ఉంటుంది. మొత్తానికి అన్నీ కుదిర్తే స‌ల్మాన్ మాజీ ల‌వ‌ర్ తో ప్ర‌భాస్ రొమాన్స్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

More Related Stories