English   

ప్ర‌భాస్ స‌మ్మ‌ర్ సంద‌డిని మిస్ అయ్యాడా..?

prabhas
2018-05-10 16:22:59

అంటే అవున‌నే చెప్పాలి. నిజ‌మే.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఏదో ర‌కంగా సంద‌డిగానే ఉన్నారు.. ఒక్క ప్ర‌భాస్ త‌ప్ప‌. బాహుబ‌లి త‌ర్వాత ఒప్పుకున్న సాహో కోసం ఏకంగా మ‌ళ్లీ రెండేళ్ల టైమ్ కేటాయించాడు ప్ర‌భాస్. ఇది రోజురోజుకూ లేట్ అవుతోందే కానీ.. త్వ‌ర‌గా పూర్త‌వుతుంది అనే శుభ‌వార్తే వినిపించ‌డం లేదు. స‌రే సినిమా అన్నాక ఇవ‌న్నీ కామ‌న్.. కానీ ప్ర‌భాస్ మాత్రం సంద‌డిలో లేకుండా పోయాడు.. ఇది నిజం.. 

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మహేష్ బాబు భ‌ర‌త్ అనేనేను బ్లాక్ బ‌స్ట‌ర్ తో మంచి జోష్ లో ఉన్నాడు. అంత‌కు ముందు రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లంతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టి ఉత్సాహంగా ఉన్నాడు. అటు ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తూ ఉన్నా.. నిత్యం లైమ్ లైట్ లోనే ఉంటున్నాడు.. అంటే ప‌రిశ్ర‌మ‌కు చాలా ద‌గ్గ‌ర‌గా.. ప‌రిశ్ర‌మ ఫంక్ష‌న్స్ కు చీఫ్ గెస్ట్ గా క‌నిపిస్తూనే ఉన్నాడు. ఇక బ‌న్నీ కూడా నా పేరు సూర్య‌తో జోష్ గానే క‌నిపిస్తున్నాడు. కానీ అటు సినిమాతో కానీ, ఇటు సినిమా ఫంక్ష‌న్స్ లో కానీ కనిపించ‌కుండా వార్త‌ల్లోనే లేకుండా ఉన్న టాప్ స్టార్ ఒక్క ప్ర‌భాస్ మాత్ర‌మే. ఈ విష‌యంలో అత‌ని ఫ్యాన్స్ కూడా కాస్త నిరుత్సాహంగానే ఉన్నారు. కనీసం సాహో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా వారితో ఎవ‌రూ పంచుకోవడం లేదు. అప్పుడ‌ప్పుడూ మీడియాలో వ‌చ్చే క‌థ‌నాలే నిజం అనుకుంటున్నారు త‌ప్ప అస‌లు నిజాలు వారికీ తెలియ‌వు. 

ఇప్పుడు సావిత్రి బ‌యోపిక్ గా వ‌చ్చిన మ‌హాన‌టి గురించి ప్ర‌తి స్టార్ మాట్లాడుతున్నాడు. కానీ ప్ర‌భాస్ ఈ విష‌యంలో క‌మెంట్ చేస్తాడ‌నుకోలేం. రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనేనేను టైమ్ లో కూడా అత‌న్నంచి ఓ ప్రశంస లాంటి కామెంట్ రాలేదు. మ‌రి మ‌రీ ఇలా ముభావంగా ఉన్నా ఇబ్బందే. అస్స‌లు ఇండ‌స్ట్రీ గురించి ప‌ట్ట‌న‌ట్టు.. ఉంటున్నాడు ప్ర‌భాస్. పోనీ ఇప్పుడు చేస్తోన్న సినిమా భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌తోంది.. మల్టీ లాంగ్వేజ్ ఫిలిమ్ క‌దా.. క‌నీసం ఇత‌ర భాష న‌టుల‌తో అయినా క్లోజ్ గా ఉంటున్నాడా అంటే అదీ లేదు. ఏదేమైనా ఈ స‌మ్మ‌ర్  టాలీవుడ్ లో చాలా పెద్ద సంద‌డి తెచ్చింది. వ‌చ్చి ప్ర‌తి పెద్ద సినిమా హిట్ టాక్ నే తెచ్చుకుంది. లేటెస్ట్ గా వ‌చ్చిన మ‌హాన‌టితో స‌హా. కానీ ఈ సంద‌డిలో ప్ర‌త్యక్షంగా కానీ, ప‌రోక్షంగా గానీ లేకుండా మిగిలిపోయాడు ప్ర‌భాస్. మ‌రి ఈ సైలెన్స్ ఇంకెన్నాళ్లో చూడాలి. 

More Related Stories