English   

ప్రభాస్ రాధేశ్యామ్ ను రీషూట్ చేస్తున్నారా

 Prabhas
2021-04-14 11:50:41

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చివరి సినిమా సాహో. ఈ సినిమా తరవాత ప్రభాస్ జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో "రాధే శ్యామ్" చిత్రాన్ని మొదలు పెట్టాడు. నిజానికి ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్, సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు రాధే శ్యామ్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయలేదు. ఉగాదికి విడుదల చేస్తారని అనుకున్నా ఒక ఫోటో వదిలి చిత్ర యూనిట్ సరిపెట్టుకుంది. 

అయితే తాజా సమాచారం ప్రకారం రాధే శ్యామ్ రీ షూట్ ను ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ రషెష్ ను చూసారట. అయితే సినిమాలోని కొన్ని సీన్లు అనుకున్నట్టుగా రాలేదట. దాంతో ప్రభాస్ ప్రభాస్ రీషూట్ వెళదామని దర్శకుడికి సలహా ఇచ్చారట. దాంతో దర్శకుడు రీ షూట్ ను ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా ఈనెలలోనే షూటింగ్ పూర్తి చేయాలని ప్రభాస్ కోరినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ పిరియాడికల్ ప్రేమ కథా చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లిమ్ప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

More Related Stories