English   

ప్రభాస్.. రానా మరోసారి

Prabhas-rana

బాహుబలిలో హీరో అండ్ విలన్ గా అద్భుతంగా ఆకట్టుకున్న జోడీ ప్రభాస్ అండ్ రానా. ప్రభాస్ కు దీటైన విలన్ పాత్రలో రానా వాల్డ్ వైడ్ ఆడియన్స్ ను అలరించాడు. ఆ పాత్రే ఇప్పుడు మనోడికి బాలీవుడ్ లో తిరుగులేని ఆఫర్స్ తెచ్చిపెడుతోంది. ఇటు ప్రభాస్ కు బాహుబలి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చింది. బాహుబలి ప్రభాస్, భళ్లాలదేవుడుగా రానా తెలుగు తెరపై తిరుగులేని సంతకం వేశారంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ జోడీకి అంత గుర్తింపు వచ్చింది. మరి అలాంటి ఈ ఇద్దరూ కలిసి మరో కొత్త సినిమాలో నటిస్తున్నరా అంటే నటించవచ్చేమో అని వినిపిస్తోంది. 

ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. ఇది ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. తర్వాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో మరో సినిమాకు కమిట్ అయ్యి ఉన్నాడు. ఇటు రానా మాత్రం ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఒప్పుకుని ఉన్నాడు. వీటిలో చాలా వరకూ హిస్టారికల్ మూవీస్ ఉండటం విశేషం. అయితే దర్శకుడుగా ఒక హిట్ మూడు ఫ్లాప్స్ అన్నట్టుగా కెరీర్ సాగిస్తోన్న దశరథ్ ఈ ఇద్దరినీ దృష్టిలో పెట్టుకుని ఓ కథ రాసుకున్నాడు. ఆ కథను త్వరలోనే ఇద్దరికీ వినిపించబోతున్నాడు. ఇక దశరథ్ అంటే ప్రభాస్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. తన కెరీర్ లో ఓ మాంచి క్లాస్ హిట్ గా నిలిచే మిస్టర్ పర్ఫెక్ట్ దశరథ్ డైరెక్షన్ లో వచ్చిందే. అందుకే ప్రభాస్ అతనికి ఖచ్చితంగా టైమ్ ఇస్తాడు. కథ నచ్చితే అతనే రానాను అడుగుతాడు అనేది వేరే చెప్పక్కర్లేదు. మొత్తంగా బాహుబలి, భళ్లాలదేవుడి పాత్రలు ఈ దశరథ్ స్క్రిప్ట్ లో ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది. 

More Related Stories