English   

బ్రిటీష్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్ ..

prabhas
2018-02-24 19:05:10

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న క్రేజీ మూవీ సాహో. బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ గా ఇమేజ్ తెచ్చుకున్న దాన్ని నేషనల్ స్టార్డమ్ గా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడీ మూవీతో. అందుకు తగ్గట్టుగానే తెలుగుతో పాటు, తమిళ, హిందీలోనూ ఏకకాలంలో నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న సాహోకోసం ఇప్పటికే చాలామంది బాలీవుడ్ స్టార్స్ ను దింపారు. హీరోయిన్ కూడా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాదాసే. అయితే సినిమాలో మరో హీరోయిన్ కూడా చాన్సుందట. ఇందుకోసం బ్రిటీష్ బ్యూటీ ఎమీజాక్సన్ ను అప్రోచ్ అవుతున్నాడు దర్శకుడు. అమీజాక్సన్ అయితే ఈ ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ పెరుగుతుందనడంలో డౌట్ లేదు. తను ఆల్రెడీ సౌత్ లో బాగా తెలుసు. బాలీవుడ్ లోనూ పరిచయమే. పైగా ఇప్పుడు శంకర్ డైరక్షన్ లో 2.0చేసింది.  ఈ సినిమా ఎలా ఉన్నా ఎమీ క్రేజ్ విపరీతంగా పెరుగుతుందని యూనిట్ చెబుతుంది. హిట్ అయితే ఇంటర్నేషనల్ గా ఫేమ్ అవుతుంది. ఆ క్రేజ్ కూడా తమకు కలిసొస్తుందనే నమ్మకంతో ఉంది సాహో టీమ్. కానీ పాత్ర మరీ చిన్నదని సమాచారం. మరి ఇంత చిన్న పాత్రలో తను చేస్తుందా లేదా అనే డౌట్ ఉన్నా.. ఇక్కడ ఉన్నది ప్రభాస్.. బాహుబలి ప్రభాస్ కాబట్టి నో చెప్పే చాన్సుండనుకుంటున్నారట. మరి ఎమీ ఏం చెబుతుందో కానీ. బ్రిటీష్ బ్యూటీతో ప్రభాస్ రొమాన్స్ అనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

More Related Stories