English   

ప్ర‌భాస్ ముందు త‌ల‌దించిన అమీర్..

Prabhas-Aamir
2018-08-02 09:33:57

అవును.. ఇండియ‌న్ సినిమా రికార్డులన్నీ తుంచి సంచిలో వేసుకెళ్లే అమీర్ ఖాన్.. ఒక్క ప్ర‌భాస్ ద‌గ్గ‌రికి వ‌చ్చేస‌రికి మాత్రం ఎందుకో కానీ సైలెంట్ అయిపోతున్నాడు. బాహుబ‌లి 2తో ఇప్ప‌టికీ నెంబ‌ర్ వ‌న్ గానే ఉన్నాడు ప్ర‌భాస్. ఈ సినిమా ఇండియాలోనే 1200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ లిస్ట్ లో మిగిలిన సినిమాలు చాలా దూరంలో ఉన్నాయి. ఇక ఇప్పుడు బ‌డ్జెట్ విష‌యంలోనూ ప్రభాస్ తో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాడు అమీర్ కాన్. ఈయ‌న ఇప్పుడు థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో న‌టిస్తున్నాడు. ధూమ్ 3 ఫేమ్ విజ‌య్ కృష్ణ ఆచార్య దీనికి ద‌ర్శ‌కుడు. ఇందులో ఒక్క షెడ్యూల్ కోసం యూర‌ప్ వెళ్లి 80 కోట్ల‌తో 45 రోజుల పాటు షూట్ చేసుకుని వ‌చ్చారు టీం. అయితే ఇక్క‌డే ప్ర‌భాస్ కంటే వెన‌క‌బ‌డిపోయాడు. సాహో కోసం దుబాయ్ లో ఏకంగా 90 కోట్లు ఖ‌ర్చు చేసారు నిర్మాత‌లు.
 
ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు సింగిల్ షెడ్యూల్ కోసం ఎక్కువ ఖ‌ర్చు చేసిన సినిమా సాహోనే. థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో ఈ రికార్డు పోతుంద‌నే అనుకున్నారు కానీ చివ‌రి నిమిషంలో మ‌ళ్లీ సాహోనే పై చేయి సాధించాడు. రేపు విడుద‌లైన త‌ర్వాత అమీర్ ఖాన్ తో క‌లెక్ష‌న్ల విష‌యంలో పోటీ ప‌డ‌తాడో లేదో తెలియ‌దు కానీ ఇప్పుడు బ‌డ్జెట్ విష‌యంలో మాత్రం అమీర్ కంటే తోపు తానే అని నిరూపించుకున్నాడు ప్ర‌భాస్. దివాళికి థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్ విడుద‌ల కానుంది. అమితాబ్.. క‌త్రినా ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఎప్పుడో సాహో విడుద‌ల కానుంది. 

More Related Stories