English   

ప్రభాస్ సినిమాలో ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయో...

Prabhas-Saaho
2018-04-20 07:49:54

ఒక పెద్ద స్టార్ హీరో సినిమా అంటే స్క్రిప్ట్ పక్కాగా లాక్ అయి ఉంటుంది. కథ, కథనం, అన్నీ కరెక్ట్ గా కుదిరాకే ఆన్ లొకేషన్ డెవలప్ మెంట్స్ ఉంటాయో కానీ.. ఆన్ లొకేషన్ డెసిషన్స్ ఉండవు. కానీ ఇప్పుడు ప్రభాస్ సాహోకు సంబంధించి స్క్రిప్ట్ లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయని వినిపిస్తోంది. ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తోన్న సినిమా సాహో. ఒకేఒక్క సినిమా చేసిన దర్శకుడు సుజిత్ సాహోకు దర్శకుడు. అఫ్ కోర్స్ టాలెంట్ ఉంటే చాలు.. ప్రీవియస్ సినిమాల కౌంట్ అక్కర్లేదు. కానీ ఈ సినిమా చాలా రోజులుగా సా..గుతూ వస్తోంది. కారణం స్క్రిప్ట్ అంటున్నారు. మరి ఈ స్క్రిప్ట్ ఎవరిది.. సుజిత్ దే. కుర్రాడు కదా.. కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది అనుకోవచ్చు. కానీ షెడ్యూల్స్ అయిపోతోన్న ఇంకా క్లారిటీ కోసం వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది సినిమా రిజల్ట్ పై భారీ ఎఫెక్ట్ చూపుతుంది. మరోవైపు షూటింగ్ లొకేషన్స్ తో పాటు, డేట్స్ విషయంలోనూ సుజిత్ తెలివి చూపించలేకపోతున్నాడనే మాటలూ వినిపిస్తున్నాయి. 

ఇక అసలు విషయం ఏంటంటే.. సుజిత్ కు ఇందులో ఎందరు ఆర్టిస్టులుండాలి అనే విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే వారానికి, పదిరోజులకు ఒకసారి ఒక్కో ఆర్టిస్ట్ నేనూ సాహోలో నటిస్తున్నానోచ్ అనేస్తున్నారు. వారి మాటలను సాహో టీమ్ ఖండించడం లేదు. అంటే ఇలా కంటిన్యూస్ ఆర్టిస్టులు సాహోలోకి ఎంటర్ అవుతున్నారనే అనుకోవచ్చు. మరి వాళ్లేమైనా మరీ చిన్న ఆర్టిస్టులా అంటే కాదు. ఇప్పటికే మందిరా బేడీ ఇలాగే ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మరో బిగ్ బాస్ బ్యూటీ వచ్చింది. మేల్ ఆర్టిస్టుల పరిస్థితి కూడా ఇంతే. లేటెస్ట్ గా మరో సెక్సీ బ్యూటీ సాహోలో నటిస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చింది. తనెవరో కాదూ.. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చగొట్టే ఎవలిన్ శర్మ. హాఫ్ జర్మన్ అయిన ఎవలిన్ గతంలో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది. కానీ బ్రేక్ రాలేదు. ఇప్పుడు సాహోలో ఓ కీలక పాత్రలో నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. 

అసలు స్క్రిప్ట్ లో క్లారిటీ ఉంటే ఇలా నెలకో ఆర్టిస్ట్ ఎంటర్ అయిపోరు. అంతా పక్కాగా సెట్ చేసుకున్నాకే కదా సెట్స్ లోకి వెళతారు. కానీ సాహో విషయంలో ఇది జరగడం లేదు. దీంతో కొన్ని రోజుల క్రితం దర్శకుడు సుజిత్ పై వచ్చిన రూమర్స్ నిజమే అనిపించకమానదు. అతనికీ యూనిట్ కీ సరిగా పడటం లేదనేదే ఆ రూమర్ సారాంశం. అతని పనితీరుపై కూడా నిర్మాతలు, హీరో అసంతృప్తిగా ఉన్నారనే మాటలు వినిపించాయి. తర్వాత అవేవీ నిజం కాదంటూ ఓ ‘సెల్ఫీ’వదిలారు. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ నుంచి ఓ భారీ నిర్మాణ సంస్థ ఎంటర్ అయింది. ఈ విషయం చెప్పుకుని చంకలు గుద్దుకున్నారు.. కానీ ముందు నుంచీ ప్రభాస్ ను బాలీవుడ్ లో ప్రమోట్ చేసిన కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ వంటి సంస్థ వీరిని పట్టించుకోవడం లేదనేది మాత్రం మర్చిపోతున్నారు. ఏదేమైనా ఈ సాహోలోకి ఇంకా క్లైమాక్స్ వరకూ ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారేమో.. 

More Related Stories