English   

రికార్డులు బద్దలు కొడుతూ మున్ముందుకు వెళ్తున్న సాహో !

Prabhas saaho
2019-08-12 09:13:25

బాహుబలి స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా మీద మొదటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా శనివారం సాయంత్రం సాహో నుంచి ట్రైలర్ విడుదలైంది. సాహో ట్రైలర్ కూడా క్రేజీగా హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో పాత యూట్యూబ్ రికార్డులన్నీ బద్ధలు కొడుతోంది. ట్రైలర్ ను తెలుగు - తమిళ్ - మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విడుదలైన కొద్దీ గంటల్లోనే వ్యూస్ విషయంలో రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో 24 గంటల్లోనే సాహో మొత్తంగా 51 మిలియన్ల యూట్యూబ్ వ్యూస్ అందుకుంది. శ్రద్ధా కపూర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, మురళి శర్మ, చుంకీ పాండే, అరుణ్ విజయ్, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 24 గంటల్లోనే రికార్డులను మడత పెట్టేసిన ఈ ట్రైలర్ మున్ముందు మరిన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి. ఒకరకంగా  బాహుబలి ట్రైలర్ ని పక్కకు పెడితే సాహో ట్రైలర్ రికార్డు బద్దలు కొట్టినట్టే. ఈ సినిమా తెలుగు వర్షన్ వీడియో 12.33 మిలియన్ వ్యూస్ ని 392K లైక్స్ ని అందుకుంది. గతంలో సినిమా చరిత్రలో హైయెస్ట్ వ్యూస్ ని తొలి 24 గంటల్లో సాధించిన టాప్ ట్రైలర్స్ ని ఒకసారి గమనిస్తే Baahubali2: 21.81M, SaahoTrailer: 12.32M, Maharshi: 7.31M, AravindaSametha : 6.98M, NaaNuvve-6.97M, VinayaVidheyaRama: 6.57 M, Agnyaathavaasi – 6.2M. అంటే నాన్ బాహుబలి ట్రైలర్స్ ను ఐదు మిలియన్ తేడాతో బద్దలు కొట్టింది. 

More Related Stories