English   

ప్ర‌భాస్ సాహోలో సెకండ్ డైరెక్ట‌ర్..?

Prabhas Sahoo

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తోన్న సాహో దాదాపు పూర్తి కావొచ్చింది. దుబాయ్ లో మేజ‌ర్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న సాహోకు సంబంధించి కొత్త గాసిప్స్ వినిపిస్తున్నాయి.నిజానికి ఇవి గ‌తంలోనూ వినిపించాయి. ఇప్పుడు మ‌ళ్లీ వ‌స్తున్నాయి. అయితే అప్పుడు ప్ర‌భాస్ తో పాటు నిర్మాత‌లు.. ద‌ర్శ‌కుడి ప‌నితీరుపై అంత సంత్రుప్తిగా లేర‌ని వినిపించింది. దీంతో స‌డెన్ గా తామంతా క‌లిసి ఉన్న ఓ ఫోటోను ట్విట్ట‌ర్ లో పెట్టాడు సాహో ద‌ర్శ‌కుడు సుజిత్. దీంతో త‌మ మ‌ధ్య భేదాభిప్రాయాలేం లేవు అన్న క‌ల‌రింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. బ‌ట్ సుజిత్ కు అనుభ‌వం లేదు. సాహో చాలా పెద్ద ప్రాజెక్ట్. ఖ‌చ్చితంగా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌స్తాయి. వ‌చ్చాయి కూడాన‌ట‌. అందుకే ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుజిత్ పై మ‌రో మ‌రో ద‌ర్శ‌కుడుని ఇన్ డైరెక్ట్ గా నియ‌మించిన‌ట్టు టాక్. అత‌ను చాలావ‌ర‌కూ మెయిన్ సీన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంటే.. సుజిత్ మాత్రం కామ‌న్ సీన్స్ చేస్తున్నాడంటున్నారు. అయితే ఆ  సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది మాత్రం బ‌య‌ట‌కు తెలియ‌కుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారంటున్నారు. కానీ క్రియేటివ్ ఫీల్డ్ లో ఇలాంటివి ఎక్కువ కాలం దాగ‌వు.

మొత్తంగా బాలీవుడ్ తార‌లు ఎక్కువ‌గా ఉన్న ఈ ప్రాజెక్ట్ లో లుక‌లుక‌లు వ‌స్తున్నాయ‌నేది ముందు నుంచీ వినిపిస్తోన్న‌దే. వీటికి ద‌ర్శ‌కుడు సుజిత్ అనుభ‌వ‌లేమి కూడా కొంత కార‌ణం కావ‌డంతో.. మ‌రో ద‌ర్శ‌కుడికి కొంత అజ‌మాయిషీ ఇవ్వ‌డం చర్చనీయాంశం అయింది. ఏదేమైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ సింగిల్ హ్యాండెడ్ గా ఉంటేనే బావుటుంది. ఫైనల్ రిజ‌ల్ట్ తేడా వ‌స్తే.. అప్పుడు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటారు. ఒక‌వేళ రిజ‌ల్ట్ బాగా వ‌చ్చినా.. ఇది నా క్రెడిట్ అంటే నా క్రెడిట్ అంటూ అప్పుడూ ఓపెన్ ఫైట్ చేసుకుంటారు. మ‌రి సాహోకు సంబంధించి సెకండ్ డైరెక్ట‌ర్ మేట‌ర్ పై ఇంకా పూర్తి వివ‌రాలు రావాల్సి ఉంది. 

More Related Stories