English   

గోదావరిఖని బొగ్గు గనుల్లో సలార్ షూటింగ్

Prabhas Salaar
2021-01-27 14:24:29

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్  కాంబినేషన్ లో "సలార్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూజాకార్యక్రమానికి హీరో యష్ అతిథిగా వచ్చి సందడి చేసాడు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిసంచబోతుందని టాక్ నడుస్తోంది. మరోవైపు దిశా పటాని కూడా ఈ సినిమాలో నటిస్తుందట. ఈ మూవీని హోంబాలే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నారు. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలను తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే కోల్ మైన్ వద్ద ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. కాగా జనవరి 28 న ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనబోతునట్టు సమాచారం..రెండు వారాల పాటు ఇక్కడ షూటింగ్ జగనుందట. ఇక సలార్ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. 2022 సంక్రాంతికి సినిమా విడుదల చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

More Related Stories