English   

సలార్ అంటే అర్థం అదే..ప్రశాంత్ నీల్

Prabhas
2020-12-04 14:44:54

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్..కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో "సలార్" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసినప్పటి నుండి సినిప్రియులు "సలార్" అంటే అసలు మీనింగ్ ఏంటని తెగ గూగుల్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమాపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ...కన్నడ స్టార్ లతో కాకుండా ప్రభాస్ తో సినిమా తీస్తుండటంతో అందరూ అడుగుతున్నారు. నేను ప్రభాస్ తో ఈ సినిమా తియ్యడానికి కారణం..అతడే నా కథకు సరిగ్గా సెట్ అవుతాడు. అందుకే ఈ కథ కోసం అతడిని ఎంచుకున్నాను. ఈ సినిమాలో  ప్రభాస్ క్యారెక్టర్ వైలెంట్ గా ఉంటుంది. సలార్ అంటే అందరూ రకరకాల అర్థాలు చెబుతున్నారు. కానీ సలార్ అంటే ఉర్ధూలో " సమర్ధవంతమైన నాయకుడు " ఓ రాజు పక్కన ఉండే కుడి భుజంగా ఉంటూ ప్రజలను రక్షించే వ్యక్తి. దీనికి తగినట్టే ఫస్ట్ లుక్ ను విడుదల చేసాం..ప్రభాస్ ను చూసి అందరూ ఆర్మీలో ఉండే వ్యక్తి అనుకుంటారనే టైటిల్ తో పోస్టర్ ను విడుదల చేశామని ప్రశాంత్ నీల్ చెప్పారు.

More Related Stories