English   

రెండు పార్ట్ లుగా ప్రభాస్ సలార్

 Prabhas Salaar
2021-06-23 15:07:11

హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇక వాటిలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా హాంబలి బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

అయితే తాజాగా సినిమాపై ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమా కథకు ఉన్న స్కోప్ కారణంగా ప్రశాంత్ నీల్ రెండు పార్ట్ లుగా విడుదల చేస్తేనే భాగుంటుందని భావిస్తున్నారట. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమాను రెండు పార్ట్ లుగా చిత్రీకరించిన సంగతి తెలిసిందే. కేజిఎఫ్ పార్ట్ వన్ విడుదల చేయగా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. మరో వైపు కే జి ఎఫ్ పార్ట్ 2 షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు సాలార్ కూడా రెండు పార్టులుగా విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
 

More Related Stories