English   

 రాజ‌మౌళి ప‌రువు కోసం ప్ర‌భాస్ పోరాటం..

prabhas-saaho
2018-04-14 16:18:04

అదేంటి.. రాజ‌మౌళి ప‌రువు కోసం ప్ర‌భాస్ పోరాటం ఏంటి..? ఇంతకీ ఏ విష‌యంలో రాజ‌మౌళి ప‌రువు కాపాడుతున్నాడు ఈ హీరో అనుకుంటున్నారా..? ప‌్ర‌భాస్ కు ఇప్పుడు నేష‌న‌ల్ వైడ్ ఇమేజ్ వ‌చ్చేసింది.. మార్కెట్ కూడా భారీగా పెరిగింది. దానికి కార‌ణం రాజ‌మౌళి అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి సినిమాతో ఈయ‌న మార్కెట్ అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ పెరిగిపోయింది. దాంతో ఇప్పుడు న‌టిస్తున్న సాహో సినిమాకు కూడా బాహుబ‌లి రేంజ్ తీసుకురావ‌డానికి చాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు ప్ర‌భాస్. ఇండియాలోనే అతిపెద్ద యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు సుజీత్. ఈ సినిమా గురించి కూడా బాలీవుడ్ లో బాగానే చ‌ర్చ న‌డుస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ ఒక్క‌డే తెలుగు న‌టుడు.. శ్ర‌ద్ధాక‌పూర్.. నీల్ నితిన్ ముఖేష్.. మందిరాబేడి లాంటి బాలీవుడ్ న‌టులు క‌నిపిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై అక్క‌డ కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్ర థియెట్రిక‌ల్ రైట్స్ హిందీలో ఏకంగా 120 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. ఇది నిజంగా ఓ రికార్డే. ఎందుకంటే ఓ సౌత్ ఇండియ‌న్ సినిమాకు ఇంత రేట్ పెట్ట‌డం అనేది క‌లే. బాహుబ‌లి తొలి భాగానికి కూడా ఇంత పెట్ట‌లేదు. రెండో భాగం సృష్టించిన సంచ‌ల‌నాల‌కు ఇప్పుడు సాహోకు ఈ రేట్ వ‌చ్చేసింది. ఇప్పుడు కానీ సాహో విజ‌యం సాధిస్తే ప్ర‌భాస్ బాలీవుడ్ లో జెండా పాతేసిన‌ట్లే..!

More Related Stories