English   

ప్రభాస్ సాహో కంటే ముందే మరో సినిమా చేస్తున్నాడు..?

prabhas-sahoo
2018-02-12 19:58:32

ప్రభాస్.. ఇప్పుడీ పేరు నేషనల్ వైడ్ గా హాట్ గా మారింది. బాహుబలి తర్వాత వచ్చిన క్రేజ్ ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తోన్న డార్లింగ్ ప్రస్తుతం సాహో లో నటిస్తున్నాడు. ట్రై లింగ్వుల్ గా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోందీ మూవీ. భారీ బడ్జెట్ తో పాటు భారీ తారాగణం కూడా ఉన్న ఈ మూవీ ఈ యేడాదే విడుదలవుతుందని చెప్పారు. కానీ అది సాధ్యం కాదని అర్థమైంది. దీంతో వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నాం అని ప్రకటించారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలందరూ స్పీడ్ పెంచారు. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమా అనౌన్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఇప్పటికే బాహుబలి కోసం ఐదేళ్లకు పైగా టైమ్ తీసుకున్నాడు. సాహో 2019సంక్రాంతికి అంటే ఏడేళ్లలో మూడు సినిమాలు చేసినట్టు. ఇది మరీ ఇబ్బందికరం. అందుకే డార్లింగ్ లేటెస్ట్ గా డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. 

సాహోతో పాటు మరో సినిమాను మొదలుపెట్టబోతున్నాడట. చాలాకాలంగా వినిపిస్తోన్న ఈ వార్త ఇప్పుడు నిజం కాబోతోందంటోంది టాలీవుడ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ ప్యూర్ లవ్ స్టోరీకి రెడీ అయ్యాడట ప్రభాస్. నిజానికి సాహో తర్వాత ఈ మూవీ మొదలుపెట్టాలనుకున్నారు. కానీ సాహో బాగా లేట్ అవుతుండటంతో మరీ ఆలస్యం అయితే బావుండదని ఆల్రెడీ స్క్రీప్ట్, స్క్రీన్ ప్లేతో సహా రెడీగా ఉన్న ఈ మూవీ స్టార్ట్ చేసి ఈ యేడాదే విడుదల చేయాలనుకుంటున్నారట. లవ్ స్టోరీ కాబట్టి.. పెద్దగా యాక్షన్ సీక్వెన్స్ లు కానీ, గ్రాఫిక్ వర్క్స్ కానీ ఉండవు. అందువల్ల కేవలం ఆరు నెలల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నారట. సో.. వీలైనంత త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందని వినిపిస్తోంది. మరి ఇదే నిజమైతే ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు బంపర్ న్యూసే కదా.. సాహో కంటే ముందే తమ డార్లింగ్ ను చూసే చాన్స్ వచ్చినట్టే కదా.. 

More Related Stories