English   

సాహోకి గుమ్మడికాయ కొట్టేశారు !

prabhas
2019-07-16 20:08:26

బాహుబలి స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సాహో సినిమా మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే నెల స్వతంత్ర దినోత్సవం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకి గుమ్మడి కాయ కొట్టేసినట్టు ప్రకటించింది సినిమా యూనిట్. ఇక ఈ దెబ్బకి యూనిట్ కి అసలు టెన్షన్ మొదలైంది. షూట్ తో పాటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడుగా జరుగుతున్నాయి. ఇక షూట్ కూడా పూర్తి కావడంతో ఫుల్ అటేన్షన్ పోస్ట్ ప్రొడక్షన్ మీదనే పెట్టారు.  సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ, అదీ కాక మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. రెండు బాషలలో డబ్బింగ్ అయిపోగా హిందీ డబ్బింగ్ మొదలుకావాల్సివుంది. ఈ మూడు భాషల్లో డబ్బింగ్ పూర్తి చేసిన తరువాత ఓకే సారి సెన్సార్ కి పంపాలసి ఉంది.  అందుకే తెలుగులో అలాగే మిగతా బాషలో ప్రమోషన్ పనులు మొదలు పెట్టలేదని అంటున్నారు. ఒక సారి సినిమా అవుట్ పుట్ చేతికి వస్తే ఎన్ని ఆటలు అయినా ఆడచ్చనే ఉద్దేశంలో ఉంది సినిమా యూనిట్.

More Related Stories