English   

రాధే శ్యామ్ టీమ్ కు డార్లింగ్ సర్ప్రైజ్

Prabhas
2021-01-15 21:06:10

బాహుబలి విజయం తరవాత డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే "జిల్" సినిమా దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న "రాధే శ్యామ్" సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక తాజాగా రాధే శ్యామ్ చిత్ర యూనిట్ సభ్యులకు ప్రభాస్ చేతి వాచ్ లు గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది. వాచ్ లకు సంబందించిన ఫోటోలను ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్  చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా సినిమాను చిత్రిస్తున్నారు. సినిమాను యూవీ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ పాతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత ప్రభాస్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్" సినిమాలో నటించనున్నాడు.

More Related Stories