English   

ప్రభాస్ కు తెలుగువాళ్లతో ప్రాబ్లమా..?

Prabhas Taken Serious Action on Who leaked Saaho Stills
2018-08-23 05:06:52

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు తెలుగువాళ్లంటే ఇష్టం లేదా..? తెలుగువారి పై ఈ బాహబలికి కోపం వచ్చిందా..? అంటే అవుననే అంటున్నారు. అందుకే తన వద్ద పనిచేస్తోన్న తెలుగువారిని తీసేశాడట. కాకపోతే ఇందులో ప్రభాస్ ప్రమేయం ప్రత్యక్షంగా లేదని చెబుతున్నారు. అయితే సినిమా రిలీజ్ అయినా ఆర్నెల్లకు సినిమా ఫ్లాప్ అని రివ్యూ ఇచ్చినట్టుందీ మేటర్.  ప్రస్తుతం ప్రభాస్ ఒక్క సినిమా వయసున్న కుర్రాడు సుజిత్ డైరెక్షన్ లో ‘సాహో’ అనే సినిమా చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో మల్టీ లింగ్వుల్ సినిమాగా రూపొందుతోన్న సాహో షూటింగ్ చాలాకాలంగా సాగుతోంది. అయితే కొన్నాళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీక్ అయ్యాయి. అయితే అవి లీక్ కావడానికి కారణం సాహో డైరెక్షన్ టీమ్ లో పనిచేస్తోన్న తెలుగు కుర్రాళ్లే అనే అనుమానం వచ్చిందట. దీంతో తమ డౌట్ కన్ఫార్మ్ చేసుకున్నారో లేక ఎవరైనా చెబితే నమ్మి వెంటనే అమలు చేశారో కానీ సుజిత్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తోన్న తెలుగు కుర్రాళ్లందర్నీ తొలగించారట.

నిజానికి ఈ పిక్స్ లీక్ కావడం వెనక సినిమా వారి ప్రమేయం కూడా ఉందనే టాక్ వచ్చిందా మధ్య. అంటే కావాలనే లీక్ చేసినట్టుగా కొందరు చెప్పుకున్నారు. దానికి ఇన్నాళ్లకు తెలుగు కుర్రాళ్లను తొలగించడం ఏమంత బాలేదని చెబుతున్నారు. అయినా తెలుగువాళ్లే చేశారు అనడానికి కూడా సరైన సాక్ష్యాలు లేవట. ఇప్పుడా కుర్రాళ్లు తమ తప్పేమీ లేదని ఎంత మొత్తుకున్నా వినకుండా టీమ్ నుంచి తొలగించినట్టు టాక్. ఏదేమైనా ఇంత భారీ సినిమా షూటింగ్ అంటే ఇలాంటి చాలా సహజం. బాహుబలి లాంటి సినిమాకే తప్పలేదు. కానీ అప్పుడు జక్కన్న ఎవర్నీ తీసేసినట్టు వార్తలు రాలేదు. మరి కేవలం ఒక సినిమా మాత్రమే చేసిన సుజిత్ మాత్రం ఎందుకిలా చేశాడో..?

More Related Stories