English   

సాహో నుంచి ప్రభాస్ అవుట్ .. 

Prabhas-saaho
2018-04-28 07:08:45

టైటిల్ చూసి షాక్ అవకండి. అవుట్ అంటే పూర్తిగా కాదు.. జస్ట్ కొన్ని రోజులు మాత్రమే. మరి ఆ కొన్ని రోజులు ఏం చేస్తాడో తెలిస్తే ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతారు కూడా. ప్రస్తుతం సాహోతో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమా దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోందిపుడు. రన్ రాజరన్ ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోన్న సాహోను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేస్తారు. ఇప్పుడు జరుగుతోంది రెండో షెడ్యూల్. ఇందుకోసం ప్రభాస్ కొన్నాళ్లుగా చాలా కష్టపడుతున్నాడు. అందుకే కాస్త రెస్ట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.  అయితే రెస్ట్ పేరుతో పూర్తిగా ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడం కాకుండా తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో పార్టిసిపేట్ చేస్తాడట. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఓ ప్రేమకథలో నటించేందుకు ఆల్రెడీ ఓకే చెప్పాడు ప్రభాస్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ అఫీషియల్ గా ప్రారంభం కాబోతోంది. అన్నట్టు ఈ మూవీని చాలాకాలం తర్వాత కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపీకృష్ణ బ్యానర్ పై నిర్మించబోతున్నారు. ప్రారంభం తర్వాత కొన్నాళ్లు మూవీ వర్క్ షాప్ లో పాల్గొంటారు. ఇందులో పూజా కూడా ఉంటుందని టాక్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీ కూడా 1980ల నేపథ్యంలో నడుస్తుందట. అంటే పీరియడ్ ఫిలిమ్. ఇంకా చెప్పాలంటే రెండు జన్మల కథ అని కూడా అంటున్నారు. అంటే ఆ జన్మలో కలుసుకోలేకపోయిన ప్రేమికులు తర్వాతి జన్మలో కలవడం వంటిదన్నమాట. ఈ రోజుల్లో ఇది కాస్త రిస్కీ సబ్జెక్టే అయినా..  కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే వర్కువుట్ అవుతుంది.. మగధీరలాగా.. 

More Related Stories