English   

రామ్ చరణ్ కోరికపై నీళ్లు చల్లుతున్న ప్రభాస్..

prabhas
2019-12-09 18:28:22

అవును.. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే అనిపిస్తుందిప్పుడు పరిస్థితి చూస్తుంటే. నిజంగానే రామ్ చరణ్ కలకు బ్రేకులేసేలా కనిపిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో సినిమా తర్వాత ఈయన మరో కుర్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ సినిమా కమిటయ్యాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మళ్లీ త్వరలోనే మొదలు కానుంది. ఇప్పటికే కొంతభాగం షూట్ పూర్తయింది కూడా. 1960ల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత ప్రభాస్ మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తుంది. మిర్చి సినిమాతో ఈయన్ని దర్శకుడిగా పరిచయం చేసిందే ప్రభాస్. ఇప్పుడు ఈయన ఏకంగా చిరంజీవిని డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమా తర్వాత త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ప్ర‌భాస్ తో కొర‌టాల ఓ సినిమా చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వరసగా నాలుగు విజయాలు అందుకుని టాప్ ఫామ్ లో ఉన్నాడు ఈ దర్శకుడు. కొరటాలతో సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రేక్షకులు కూడా. ఈ కోరిక త్వరలోనే నెరవేరబోతుందని తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ కూడా చాలా రోజులుగా కొరటాలతో సినిమా చేయాలనుకుంటున్నాడు. నిజానికి ఈ కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాలి.. శ్రీమంతుడు కంటే ముందే ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కుదర్లేదు.. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నాడు కానీ రామ్ చరణ్ తో వర్కవుట్ కాలేదు. చిరు తర్వాత చేస్తాడేమో అనుకుంటే ప్రభాస్ వచ్చేస్తున్నాడు. దాంతో చరణ్ కు షాక్ తప్పేలా లేదు. మరి చూడాలిక.. కనీసం ప్రభాస్ తర్వాతైనా చరణ్ తో కొరటాల సినిమా చేస్తాడో లేదో..?

More Related Stories