English   

మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్

 Prabhas
2021-04-16 17:14:23

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక ప్రాజెక్టు పూర్తవ్వకుండానే మరో ప్రాజెక్టు ను లైన్ లో పెడుతున్నారు. ప్రభాస్ ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. అయితే పూర్తయ్యాక ఔట్ పుట్ చూస్తే కొన్ని సీన్లు తేడా కొట్టాయట. దాంతో ఇప్పుడు మరో 10 రోజులు రీషూట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ ను సైతం మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

మరోవైపు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ మూడు సినిమాలతో పాటు ఇప్పటికే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఏకంగా ప్యాన్ వరల్డ్ సినిమా చేయడానికి ఒకే చెప్పారు. ఇంకా సినిమా మొదలవ్వకపోయినా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం వచ్చేసింది. 

ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ 24 పై కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ 24 ను బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించబోతున్నారట. అంతే కాకుండా ఇప్పటికే ప్రభాస్ "ఆది పురుష్" షూట్ లో ఉన్నసమయంలో కథ వినిపించారట. కథ నచ్చడం తో ప్రభాస్ ఒకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ వాళ్ళు నిర్మించబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

More Related Stories