English   

ప్రభాస్ తర్వాత విజయ్ దే ఆ రికార్డ్

Prabhas's Baahubali Distributor Releasing Vijay's Mersal in China
2018-08-11 21:12:05

సౌత్ సినిమాల మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. బాహుబలి తర్వాత వేర్వేరు దేశాలు కూడా ఇండియన్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అయితే బాహుబలి తర్వాత సౌత్ నుంచి ఆ స్థాయి సినిమాలు రాలేదు. దీంతో కొన్ని దేశాల మార్కెట్స్ మన సినిమాలపై ఇంట్రస్ట్ చూపిస్తున్నా ఆ స్థాయిలో సినిమాల కంటెంట్ లేకపోవడంతో వాళ్లు కాస్త నిరాశ చెందుతున్నారు. ఇలా మన సినిమాకు ఓవర్సీస్ కంటే బిగ్గెస్ట్ మార్కెట్ మారిన దేశం చైనా. యస్.. చైనా నుంచి సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే బాహుబలి, దంగల్, భజరంగీ బాయిజాన్, హిందీ మీడియం, సీక్రెట్ సూపర్ స్టార్, ప్యాడ్ మ్యాన్ వంటి సినిమాలు అక్కడ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కానీ ఈ విషయంలో బాహుబలి తర్వాత మన సౌత్ నుంచి మరో సినిమా కనిపించలేదు. కానీ ఇప్పుడా రేర్ ఫీట్ ను కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సాధించాడు.

విజయ్, ఆట్లీ కాంబినేషన్ లో వచ్చిన మెర్సల్ అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇందులో విజయ్ త్రిపాత్రాభినయం చేశాడు. మెడికల్ స్కామ్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలోని జీఎస్టీకి సంబంధించిన డైలాగ్స్ వివాదాలకు దారితీసినా మెజార్టీ ఆడియన్స్ మాత్రం సినిమా కంటెంట్ కే ఓటేశారు. మొత్తంగా 120కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు చైనాకు వెళ్లబోతోంది. చైనాలో భజరంగీ భాయీజాన్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘హెచ్.జి.సి. ఎంటర్టైన్మెంట్’ సంస్థ మెర్సల్ ను చైనాలో విడుదల చేయబోతోంది. మరి ఈ సినిమా కానీ మంచి విజయం సాధిస్తే మన సౌత్ నుంచి మరిన్ని సినిమాలకు అక్కడ విడులయ్యే స్కోప్ ఉంటుంది. అలాగే మార్కెట్ పెరుగుతుంది. చిన్నదైనా పెద్దదైనా.. మనకంటూ ఓ మార్కెట్ ఏర్పడితే ఖచ్చితంగా సినిమాల రేంజ్ కూడా పెరుగుతున్నట్టే అనుకోవచ్చు. మరి మెర్సల్ ఎలాంటి రిజల్ట్ చూస్తుందో చూడాలి.

More Related Stories