English   

ఓకే రోజున తమన్నా-ప్రభుదేవాల రెండు హారర్ సినిమాలు ?

prabhu
2019-05-21 09:00:37

ఒకే హీరో, ఒకే హీరోయిన్ కలిసి రెండు భాషల్లో నటించిన సినిమాలు రెండూ, ఒకే రోజున విడుదల కావడమనేది వినడానికి కాస్త వింతగా ఉన్నా అది ఈ నెలాఖరుకు జరగనుంది. నిజానికి ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు తమన్నా - ప్రభుదేవాల విషయంలో జరుగుతోంది.  తమిళంలో తమన్నా - ప్రభుదేవా కలిసి 'దేవి2' సినిమా ని తమిళ తెలుగు(అభినేత్రి 2)లో రిలీజ్ చేయనున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక తమన్నా - ప్రభుదేవా కాంబినేషన్లో హిందీలో 'ఖామోషి' హారర్ సినిమా తెరకెక్కింది. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీనే విడుదల చేయనున్నారు. హాలీవుడ్ సినిమా హుష్ ప్రేరణతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా మూగ చెవిటి యువతీగా నటించనుంది. ఇలా తమన్నా - ప్రభుదేవా కలిసి చేసిన సినిమాలు రెండు, ఒకే రోజున  ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా విశేషమేనని చెప్పుకోవాలి. 

More Related Stories