English   

ఏపీ రాజ‌ధాని ఇష్యూ..స్వారీ చెప్పిన ప్ర‌దీప్

Pradeep Machiraju
2021-06-22 09:26:37

టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కు వివాదాలు పెద్ద కొత్తేం కాదు అని చెప్పవచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డం ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చి క్లారిటీ ఇవ్వ‌డం జ‌రిగింది. అయితే ప్రస్తుతం కూడా ప్రదీప్  వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే షో లో ప్రదీప్ ఆంధ్రప్రదేశ్ రాజధాని 'విశాఖ' అంటూ వ్యాఖ్యానించ‌డం జరిగింది. ఈ వ్యాఖ్యలపై ఏపీ పరిరక్షణ సమితి సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న విషయాల గురించి మాట్లాడడం తప్పు అని అమరావతి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని , ఇలాంటి సున్నితమైన విషయాలను ప్రదీప్ లాంటి వ్యక్తి మాట్లాడడం తప్పు అని వెంటనే ఈ విషయమై క్షమాపణ కోరి తన మాటను ఉపసంహరించుకోవాలని లేనట్లయితే, హైదరాబాదులో ఉన్న తన ఇంటిని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కన్వీనర్ 'కొలికలపూడి శ్రీనివాసరావు' తెలిపారు. కాగా తాజాగా ఈ విష‌యం పై స్పందిస్తూ ప్ర‌దీప్ మాచిరాజు ఓ వీడియోను విడుద‌ల చేశారు. తాను అమ‌రావ‌తి రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్టు ప్ర‌దీప్ స్ప‌ష్టం చేశారు. 

More Related Stories