English   

ప్ర‌ణీత‌.. ఎట్ట‌కేల‌కు ఒక్క‌టి..!

Praneetha-Subhash-Ram
2018-04-13 11:26:22

బాపుబొమ్మ అంటే ఒక‌ప్పుడు నిజంగానే బాపు బొమ్మ‌లు గుర్తుకొచ్చే వాళ్లు. కానీ ఏ క్ష‌ణంలో అయితే ప్ర‌ణీత‌తో బాపుబొమ్మ అంటూ ప‌వ‌న్ పాట వేసుకున్నాడో అప్ప‌ట్నుంచే తెలుగు వాళ్ల‌కు బాపు బొమ్మంటే ప్ర‌ణీతే అయిపోయింది. ఇప్ప‌టికీ ఈ ముద్దుగుమ్మ‌ను కొంద‌రు బాపుబొమ్మ అనే పిలుస్తారు. ఈ పాట ఐదేళ్లైనా ఇప్ప‌టికీ అదే పేరుతో ఉంది ప్ర‌ణీత‌. అత్తారింటికి దారేది త‌ర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. అదేం దుర‌దృష్ట‌మో కానీ అన్ని సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్ గానే న‌టించింది ఈ భామ‌. ఆ త‌ర్వాత అస‌లు క‌నిపించుకుండా పోయింది. అస‌లు ప్ర‌ణీత‌ను పూర్తిగా మరిచిపోయిన టైమ్ లో ఇప్పుడు స‌డ‌న్ గా గుర్తు చేస్తున్నాడు రామ్. ఈయ‌న న‌టిస్తోన్న హ‌లో గురు ప్రేమ కోస‌మే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్సిచ్చాడు. త్రినాథ‌రావ్ న‌క్కిన తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. రెండో హీరోయిన్ గా ప్ర‌ణీత‌ను తీసుకున్న‌ట్లు క‌న్ఫ‌ర్మ్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అవ‌కాశాలు స‌రిగ్గా లేకపోవ‌డంతో అంద‌రు భామ‌ల మాదిరే అందాల ఆర‌బోత‌కు తెర‌తీసింది. చిన్న‌చిన్న డ్ర‌స్సుల్లో మ‌తులు పోగొట్టే ప్రోగ్రామ్ పెట్టేసింది ప్ర‌ణీత‌. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోనూ అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఈ భామ మ‌రీ హ‌ద్దులు దాటేస్తుంది. ఈ మ‌ధ్యే ప్ర‌ణీత ఫోటోషూట్ ఒక‌టి విడుద‌లైంది. ఇందులో అమ్మ‌డి అందాల ఆర‌బోత చూసి ఎవ‌రైనా ఫిదా అయిపోవాల్సిందే..! ఈ అందాలను చూసే ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌ణీత‌ను గుర్తు పెట్టుకుని మ‌రీ ఆఫ‌ర్లు ఇస్తున్నట్లున్నారు. 

More Related Stories