English   

స్నేహ ప్రసన్న దంపతులకు పొరుగింటి ముస్లింల స్పెషల్ గిఫ్ట్

 Prasanna Sneha
2020-10-26 12:12:08

భారత దేశం అన్ని మతాల సమ్మేళనం. ఇక్కడ ఏ పండగ అయినా అన్ని మతలవారు కలిసి జరుపుకుంటారు. ఒకరికి కష్టం వస్తే మరొకరు మేమున్నాం అంటూ అండగా నిలుస్తారు. ఒక మతం వారి పండుగలకు ఇతర మతస్థులకు ఆహ్వానించి భోజనాలు పెట్టడం, కలిసి జరుపుకోవడం చేస్తుంటారు. ఇదిలా ఉండగా తాజాగా నటి స్నేహ, ప్రసన్న దంపతులకు విజయదశమి పండగ సందర్భంగా వారి పోరిగింట్లో ఉండే ముస్లిం దంపతులు బిల్వం చెట్టును గిఫ్ట్ గా ఇచ్చారు. అంతే కాకుండా ఆ చెట్టును కలిసి నాటారు. ఈ సందర్భంగా వారు మొక్క నాటిన ఫోటోను ప్రసన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ప్రసన్న తన పోస్ట్ లో "నా వాట్సాప్ డీపీలో ఎప్పుడూ శివుడి ఫోటో ఉంటుంది. అది చూసిన మా పక్కింటి జబీర్, నజీమా దంపతులు ఈరోజు ఉదయం నాకు బిల్వం చెట్టును గిఫ్ట్ గా ఇచ్చారు. అంతే కాకుండా చెట్టు నాటే సమయంలోనూ వారు మా పక్కన ఉండి చేయి వేశారు. పండగ పూట ఇంతకన్నా గొప్ప సంతోషం ఏముంటుంది" అంటూ ప్రసన్న తన పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఈ పోస్ట్ ను నెటిజన్లు షేర్లు చేస్తున్నారు. ఇండియా అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

More Related Stories