English   

ధనుష్ తో సినిమా ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యువ డైరెక్టర్

Prasanth Varma
2019-06-15 16:44:19

ఆ లాంటి వినూత్నమైన సినిమాతో దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఒక విలక్షమైన కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడంటూ అంతా ప్రశంసించారు. ఆయన రెండో సినిమాగా కల్కి సినిమా రూపొందింది. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆయన మూడో సినిమాకి జాక్ పాత కొట్టాడని చెప్పుకుంటున్నారు సినీ జనాలు. అందుతున్న సమాచారం మేరకు ఆయన సూపర్ స్టార్ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని అంటున్నారు. ఈ మధ్యనే ఆయన ధనుష్ ని కలిసి ఒక కధ చెప్పడం, ఆ కధ ధనుష్ కి నచ్చడం జరిగిపోయాయని, ఈ కల్కి సినిమా రిలీజ్ కాగానే ఆ సినిమా మొదలు పెట్టనున్నారని టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుందని, దీని కోసం సరికొత్త కదాంశాన్ని  ప్రశాంత్ వర్మ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో ధనుశ్ పాత్ర కూడా మునుపెన్నడూ లేని విధంగా చాలా డిఫరెంట్ గా వుంటుందట. అందువల్లనే వెంటనే ఆయన ఓకే అనేశాడని చెబుతున్నారు. తమిళ్ స్టార్ ధనుష్ తో మూవీ అంటే ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అవ్వచ్చు. చూడాలి మరి ఈ వార్త ఎంతవరకు నిజం అవుతుందో ?

More Related Stories