English   

ప్రశాంత్ నీల్ తో సినిమాపై ఎన్టీఆర్ క్లారిటీ...ఫ్యాన్స్ కి పండగే

Prashanth Neel
2021-05-12 18:10:18

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ దశకు చేరుకుంది. ఈ చిత్రం తరవాత ఎన్టీఆర్ కొరటాల తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ సినిమాపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేసారు. ప్రస్తుతం కొరటాల సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధమవుతుందని అన్నారు. ఈ చిత్రం తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తానని చెప్పారు. 

ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.." ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాను. ఈ సినిమా తరవాత కొరటాల శివ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తాను. ప్రస్తుతం ఈ సినిమాపైనా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మాకు ఒక ఆలోచన ఉంది. ఇక ఇప్పటికే మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక కొరటాల సినిమా పూర్తయిన తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సినిమా ఉండబోతుంది." అంటూ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరవాత ఎన్టీఆర్ తో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

More Related Stories