English   

సలార్ కథ ఇదేనట..15 ఏళ్ల నాటి జక్కన కథతోనే ప్రశాంత్ నీల్

 Prashanth Neel
2021-03-02 17:30:23

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా "సలార్". ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన నాటినుండి కథ ఎలా ఉండబోతోందో అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.  అయితే ఈ సినిమా కథ పై అనేక రకాల వార్తలు చక్కర్లు కొఫుతున్నాయి. ప్రశాంత్ నీల్ తీసిన రెండు సినిమా రౌద్రం, కేజీఎఫ్ లలో అనామకుడిగా ఉన్నవాడు లీడర్ గా ఎదగటం అనే కాన్సెప్ట్ పైనే బేస్ అయ్యి ఉంటాయి. 

అలాగే రాజమౌళి ప్రభాస్ తో 15ఏళ్ల క్రితం తీసిన  ఛత్రపతి సినిమాలోనూ అణమకుడు ఉన్న హీరో చివర్లో  లీడర్ గా మారుతాడు. కాగా ఇప్పుడు ప్రభాస్  తో తీస్తున్న సలార్ సినిమా కూడా అలానే ఉండబోతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ నీల్ సలార్ అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని..ఒక గ్రూప్ లో కుడి భుజం లా ఉండేవాడు లీడర్ గా ఎదుగుతాడాని వెల్లడించాడు. దాంతో ఈ సినిమాలో కూడా ఛత్రపతి సినిమా లో లాగా ప్రభాస్ లీడర్ గా ఎదుగుతాడని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రభాస్ కెరీర్ లో ఛత్రపతి ఎంత పెద్ద హిట్టో ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తోనే ప్రభాస్ కు ఒక రేంజ్ లో ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది. మరి సలార్ తో ప్రభాస్ రేంజ్ ఎక్కడికి వెళ్లిపోతుందో చూడాలి.

More Related Stories