English   

ఫస్ట్ లుక్ ఆ రోజు రిలీజ్ చేయనున్న ప్రశాంత్ వర్మ

prashanth varma
2020-08-03 12:17:01

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన మూడవ చిత్రం ప్రీ-లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ అతని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రీ లుక్ అలానే మోషన్ పోస్టర్లు ఘోరమైన మొసలి లాంటి ఒక దాని నోట్లోన్ నుండి కర్నూలు కొండారెడ్డి బురుజును చూపిస్తున్నట్టు ఉంది. అలానే ఈ పోస్టర్ లో CORONA WAS JUST THE BEGINNING…అంటూ పేర్కొన్నారు. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మొదటి కరోనా చిత్రంగా అని పేర్కొన్న ప్రశాంత్ వర్మ యొక్క మూడవ చిత్రం లాక్డౌన్ అమలుకు ముందే 40% షూట్ జరిగిపోయిందని పేర్కొన్నారు. ఇక  ఈ మోషన్ పోస్టర్ లో కొండారెడ్డి బురుజు ముందు జనాలు పడిపోయి చనిపోతున్న విషయాన్ని చూపించారు. అంటే బహుశా దీనిని కర్నూల్ నేపధ్యంలో తెరకెక్కించి ఉండచ్చని అంటున్నారు. తెలుగు స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడని జానర్ లో ఈ సినిమా ఉండబోతుద్నని చెబుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఆగ‌స్టు 15న స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. నటీనటులు ఇతర వివరాలు ఏవీ బయటకు రాలేదు.

More Related Stories