English   

బాలీవుడ్ ప్రస్థానం మొదలైంది..

prasthanam

కొన్నాళ్ల క్రితం దేవా కట్టా దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం తెలుగులో మంచి విజయం సాధించింది. మారుతున్న మన సినిమా ఆరంభ దశలో వచ్చిన ప్రస్థానం నిజంగా ఓ ఎపిక్ లాంటి సినిమా. స్టార్ వాల్యూ లేకపోవడం వల్ల అనుకున్నంత పెద్ద విజయం సాధించలేదు కానీ.. ఈ మూవీకి విమర్శకుల నుంచీ విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. శర్వానంద్ హీరోగా నటించినా.. ప్రధాన పాత్ర సాయికుమార్ దే. ఇక అసలే డైలాగ్ కింగ్ అయిన సాయికుమార్ చెప్పిన డైలాగ్స్ కు థియేటర్ లోనే కాదు.. యూ ట్యూబ్ లో చూసినా క్లాప్స్ పడతాయి. ఈ డైలాగ్స్ కూడా రింగ్ టోన్స్ గా మారాయంటే అర్థం చేసుకోవచ్చు.. ప్రస్థానం రేంజ్ ఏంటో.. ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు సాధించలేకపోయిన దర్శకుడు దేవా కట్టా ఇప్పుడు ఇదే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.

బాలీవుడ్ ప్రస్థానంలో సాయికుమార్ పాత్రకు సంజయ్ దత్ ఒప్పుకున్నాడు. సంజూ భాయ్ ప్రధాన పాత్ర అంటే సినిమా రేంజ్ ఓ రేంజ్ లో మారుతుందని వేరే చెప్పక్కర్లేదు. ఇక గత కొన్నాళ్లుగా అసలు ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్ వెర్షన్ ఉంటుందా అనుకున్న వారికి ఏకంగా ఫస్ట్ లుక్ తో ఆన్సర్ చెప్పాడు దేవా కట్టా. యస్.. బాలీవుడ్ ప్రస్థానం ఫస్ట్ లుక్ వచ్చేసింది. అన్నట్టు ఈ సినిమాకు నిర్మాత కూడా సంజూ భాయ్ నే. మరి ఈ సినిమా  దేవా కట్టా కెరీర్ ను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి. 

More Related Stories