English   

ప్రతిరోజూ పండగే రివ్యూ

Prati Roju Pandage Movie Review
2019-12-20 19:26:28

చానళ్ళ నుండి హిట్స్ అనేవే లేక ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ ఈ ఏడాది చిత్రలహరితో హిట్ కొట్టి ఆ ట్రాక్ నుండి బయట పడ్డాడు. ఇక యూత్ ఫుల్ అలాగే ఎంటర్టైనింగ్ సినిమాలు తీస్తాడని పేరున్న మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా అది కూడా ప్రతి రోజూ పండగే అనే పేరుతో రానుండడంతో ఆ సిన్మా మీద ఆసక్తి నెలకొంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ మొదలు ట్రైలర్ దాకా ఇంకా బాగుండడంతో సిన్మా మీద అంచనాలు ఇంకా పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందో లేదో చూద్దాం.

కథ :

ఈ కథ ట్రైలర్ లోనే చెప్పేశారు. రఘురామయ్య (సత్యరాజ్) ముగ్గురు కొడుకులు కూతుళ్ళు యూఎస్, ఆస్ట్రేలియా, హైదరాబాద్ అంటూ అందరూ దూరంగా సెటిల్ అయిపోతారు. రాజమండ్రిలో ఉండే రఘురామయ్యకు లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు ఆయన మరో ఐదు వారల కంటే ఎక్కువ కాలం బ్రతకడని డాక్టర్లు చెబుతారు. ఈ నేపథ్యంలో తన తాతకు తీరకుండా ఉండిపోయిన కోరికలను తీర్చడానికి దిగుతాడు సాయి(ధరమ్ తేజ్) అక్కడి నుండి ఏమైంది ? ఏంజెల్ ఆర్నా(రాశి)తో అతని ప్రేమ ఏంటో అవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

మారుతి సినిమా అనగానే సాధారనంగా బూతు గుర్తొచ్చేది జనాలకి కానీ ఈ మధ్య రూటు మార్చిన మారుతి, ఎఫెక్టివ్ గా ఏది ఒక జబ్బును వాడుకుని ఎంటర్టైనింగ్ సినిమాలు చేయడం మొదలెట్టాడు. ఈ సినిమాలో కూడా బిజీ అని ఫీల్ అయ్యే అందరిని కార్నర్ చేస్తూ తెరకెక్కించాడు. మొదటి హాఫ్ అంతా ఎంటర్టైనింగ్ వే లోనే నడిపించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ సగం నుండి ఎమోషన్స్ తో నింపేశాడు. కామెడీ, సెంటిమెంట్ ని బ్యాలెన్స్ తప్పినట్టు అనిపించినా మొత్తానికి ఏదో రకంగా బాగుందని పించాడు. అమ్మానాన్నలను ఊర్లలో వదిలేసి ఎక్కడో పని చేసుకుంటున్న వారందరూ తప్పక చూడాల్సిన సినిమా.

నటీనటులు :

నటన విషయానికి వస్తే సాయి తేజ్ తనదైన నటనతో మెప్పించాడు. ఎమోషనల్ సీన్లలో తేజ్ నటన పవన్ ని జ్ఞప్తికి తెచ్చింది. రాశి ఖన్నా అందంగా కనిపించింది. తింగరి పిల్ల పాత్రలో దకు వంద శాతం న్యాయం చేసింది. టిక్ టాక్ స్టార్ గా ఒక రేంజ్ కామెడీ పండించింది. రావు రమేష్ పాత్ర ఈ సినిమాకే హైలైట్ , ఆయన నటనా అంతే. సినిమాలో సాయి తేజ్, సత్యరాజ్ మెయిన్ అనుకుని సినిమాకి వెళ్తే రావు రమేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. సత్యరాజ్ తన పాత్రకు జీవం పోసాడు. కుటుంబ బంధాలను కోరుకునే చరమాంకంలోని వ్యక్తిగా సత్యరాజ్ ఆకట్టుకుంటాడు. హరితేజ, భార్గవి, అజయ్, సత్యం రాజేష్ తదితరులు తమతమ పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం :

ఈ సినిమా దర్శ్హకుడిగా కొన్ని కొన్ని చోట్లా తడబడినా ఇటువంటి సబ్జెక్టు తీసుకుని మారుతి దర్శకుడిగా మరో మెట్టు ఎక్కినట్టే. సిన్మా మొదట్లోనే ఈ కథ అందరికీ తెలిసిన కధే అంటూ మొదలెట్టిన తీరు బాగుంది. థమన్ అందించిన పాటలు అన్నీ కూడా ఆకట్టుకునేలా లానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలాబాగా కుదిరింది. ఫ్రేమ్స్ అన్నీ కలర్ గుల్ గా ఉన్నాయి. గీతా వారి నిర్మాణ విలువలకి వంక పెట్టేదేముంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగులు అందరినీ ఆలోజింపచేస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి. బోయపాటి స్టైల్ ని జ్ఞాపకం తెచ్చాయి. స్టోరీ లైన్ సింపుల్ గా ఉన్నా ఆసక్తికరంగా ఉంది.

ఫైనల్ గా : ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్.

రేటింగ్: 3 /5.

More Related Stories