English   

రామ్, ప్రవీణ్ సినిమా మొదలైంది.. 

Praveen-Sattar
2018-04-26 15:57:21

ప్రవీణ్ సత్తారు, రామ్ కాంబినేషన్ లో స్టార్ట్ కావాల్సిన సినిమా ఆ మధ్య ఆగిపోయింది. ఈ సినిమాకు రామ్ మార్కెట్ ను మించిన బడ్జెట్ అవుతుందని అప్పటి నిర్మాత డ్రాప్ అయ్యాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్టే అనుకున్నారు. కానీ మరోసారి స్రవంతి మూవీస్ ముందుకు వచ్చింది. రామ్ కు హోమ్ బ్యానర్ అయిన స్రవంతి బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కబోతోంది. ప్రవీణ్ సత్తారు రీసెంట్ మూవీ గరుడవేగ. ఈ సినిమా తర్వాత అతనికి చాలామంది నిర్మాతలు బ్లాంక్ చెక్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అలాగే చాలామంది హీరోలు కూడా సినిమా చేస్తామని ముందుకొచ్చారు. కానీ తన కథకు సూట్ అయ్యే హీరోలనే సెలెక్ట్ చేసుకోవడం ప్రవీణ్ స్టైల్. అందుకే ఈ కథకు రామ్ మాత్రమే సెట్ అవుతాడని అతనితోనే సినిమా చేస్తానని ఇన్నాళ్లూ వెయిట్ చేశాడు. మొదట్లో ఓ నిర్మాత ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. కానీ విదేశీ లొకేషన్స్ లో ఎక్కువ భాగం షూటింగ్ ఉండటంతో.. బడ్జెట్ పెరుగుతుందని.. రామ్ కు ఇప్పుడంత మార్కెట్ లేదని.. వెనక్కి తగ్గాడు.  అయినా ప్రవీణ్ సత్తారు వెనక్కి తగ్గలేదు. ఫైనల్ గా స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. ఇవాళ అఫీషియల్ గా ప్రారంభం అయిందీ మూవీ. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోన్న ఈ మూవీ ఆడియన్స్ కు సరికొత్త ఫీల్ ఇస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు ప్రవీణ్ సత్తారు. ప్రస్తుతం రామ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న మూవీలో నటిస్తున్నాడు. అది దాదాపు పూర్తి కావొచ్చింది. తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన ఇతర కాస్ట్ అండ్ క్రూకు సంబంధించిన వివరాలు త్వరలనే తెలియజేస్తారట.

More Related Stories