English   

గరుడవేగ దర్శకుడితో రామ్..

Praveen-Sattaru

గరుడవేగతో సూపర్ హిట్ కొట్టి ఎంటైర్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గరుడవేగ తర్వాత ప్రవీణ్ పై ఇండస్ట్రీలో భారీ గురి కుదిరింది. చాలామంది పెద్ద నిర్మాతలు ప్రవీణ్ పై కర్చీఫ్ వేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ప్రవీణ్ నెక్ట్స్ సినిమాకు సంబంధించి ఓ హాటెస్ట్ న్యూస్ వినిపిస్తోంది. ప్రవీణ్ తో హీరో రామ్ సినిమా చేయబోతున్నట్టు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఆరేడేళ్లలో రామ్ నుంచి వచ్చిన ఒకేఒక్క హిట్ నేను శైలజ. అతని ఎనర్జీకి ఎప్పుడో ఈ సబ్ స్టార్స్ లీగ్ లో టాప్ లో ఉండాల్సిన వాడు కానీ.. వరుస ఫ్లాపులతో కెరీర్ జిందగీ కరాబ్ అయిపోయింది. ప్రస్తుతం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో సినిమాకు సిద్ధమవుతున్నాడు రామ్. ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. 
నిజానికి ప్రవీణ్ సత్తారు నితిన్ తో సినిమా చేస్తాడనే వార్తలు మొదట్లోనే వచ్చాయి. మరి ఏమైందో కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో రామ్ పేరు వినిపిస్తోంది. అఫ్ కోర్స్ రామ్, నితిన్ ల మధ్య ఏజ్ గ్యాప్ లేదు. ఇమేజ్ తో ఇబ్బంది లేదు కాబట్టి.. తను అనుకున్న కథ ఈ ఇద్దరిలో ఎవరితో చేసినా.. చిన్న చిన్న మార్పులతో ఓకే అయిపోతుంది. మొత్తంగా ఈ వార్త కూడా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు కానీ.. ప్రవీణ్ సత్తారు ఎప్పుడు చేసినా ఆ సినిమాను నిర్మించేందుకు భవ్య క్రియేషన్స్ బ్యానర్ రెడీగా ఉంది. 

More Related Stories