English   

ప్రవీణ్ సత్తారు మామూలోడు కాదుగా..?

Praveen-Sattaru
2018-05-06 17:18:47

ప్రవీణ్ సత్తారు.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడు. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ.. ప్రతి సినిమాతో దర్శకుడుగా స్థాయిని పెంచుకుంటూ వెళుతోన్న దర్శకుడు. గరుడ వేగకు ముందు వరకూ ప్రవీణ్ ను పెద్ద నిర్మాతలెవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ గరుడవేగ తర్వాత స్టార్ హీరోలు కూడా ప్రవీణ్ ను నమ్మొచ్చు అని ఫీలయ్యారు. కానీ మనోడు స్టార్స్ కు లొంగే రకం కాదు. స్టోరీస్ ను బట్టి వెళ్లే టైప్. అందుకే ఇప్పుడు తన కథకు కరెక్ట్ గా సరిపోతాడని ఫ్లాపుల్లో ఉన్న రామ్ తో సినిమాకు సిద్ధమయ్యాడు. రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ప్రవీణ్ తీసుకుంటోన్న నిర్ణయాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. 

ఇప్పటికే రామ్ సినిమాలో రాజశేఖర్ ను విలన్ గా ఒప్పించాడు అనే టాక్ వచ్చింది. ఈ విషయం ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు మరో బ్యూటీని కూడా ఈ సినిమాలో రిపీట్ చేయాలనుకుంటున్నాడు. ఆ బ్యూటీ ఎవరోతెలుసా.. 40ప్లస్ లో కూడా ఏ మాత్రం బింకం తగ్గని పూజాకుమార్.. యస్.. గరుడవేగలో నటించిన పూజా కుమారే. రాజశేఖర్ భార్యగా కనిపించిందా సినిమాలో. ఇప్పుడు కూడా రాజశేఖర్ కు పెయిర్ గానే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట ప్రవీణ్. గరుడవేగతో లక్ వచ్చింది కాబట్టి.. ఈ లక్కీ కపుల్ ను రిపీట్ చేస్తున్నాడా అనుకోవడానికీ లేదు. ఎందుకంటే అతనికి ఇలాంటి సెంటిమెంట్స్ పైనా పెద్దగా నమ్మకం లేదు. కాకపోతే గరుడవేగలో ప్రాధాన్యం లేని పాత్రలోనే శ్రద్ధాదాస్ ను తీసుకుంటే రకరకాలుగా మాట్లాడుకుంది టాలీవుడ్. మరిప్పుడు ఏ కారణంతో రాజశేఖర్ ను, పూజాను మళ్లీ తీసుకోవాలనుకుంటున్నాడో కానీ.. ప్రవీణ్ మాత్రం మామూలోడు కాదు అనుకుంటున్నారు సినీ జనాలు.. 

More Related Stories