English   

సోనూకు ప్రతిష్టాత్మక అవార్డు

Sonu Sood.jpg
2020-09-30 08:07:04

నటుడు సోనూసూద్ చేసిన సేవలకు గానూ ప్రతిష్టాత్మక పురస్కారం ఆయనను వరించింది. ఐక్యరాజ్యసమితి అనుబంద సంస్థ యునిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) స్పెషల్ హుమానిటేరియన్ యాక్షన్ అవార్డును సోనుకు అందజేసింది. కాగా ఈ అవార్డును ఇప్పటివరకు బాలీవుడ్ నుండి అతి కొద్ది మంది నటులు మాత్రమే అందుకున్నారు. సోనూ చేసిన సహాయ కార్యక్రమాలకు ఇప్పటివరకు కేవలం ప్రశంసలే రాగా ఒక గొప్ప అవార్డు ఇప్పుడు ఆయనను వరించడంతో ప్రముఖులు ఆయనను ప్రశంసిస్తున్నారు.

కరోనా విజృంభనతో కేంద్ర ప్రభుత్వం సడెన్ గా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల ఎన్నో వలస కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి. సొంత గ్రామాలకు వెళ్ళడానికి రవాణా లేక కాలి నడకన వెళ్లే కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. కాగా అలా కష్టాలు పడుతున్న వారిని ఆదుకునేందుకు సోనూ తన సొంత డబ్బులతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాడు. అంటే కాకుండా దగ్గరుండి వారికి భోజనాలు పెట్టించి బస్సులు ఎక్కించారు. కోవిడ్ సమయంలో విద్యార్థులు రవాణా సౌకర్యం కల్పించాలంటూ కోరడంతో వెంటనే బస్సులు ఏర్పాటు చేశాడు. మరో వైపు వైద్య సహాయం తో పాటు అవసరమైన వారికి ఉపాధి అవకాశాలను కూడా కల్పించారు. దాంతో ప్రజలు సోనూ సూద్ కు సోషల్ మీడియాలో నీరాజనం పట్టారు.

More Related Stories