English   

కండలే కాదు.. రొమాన్స్ కూడా పెంచాడు

Prince-six-pack-look
2018-08-08 18:59:40

రొమాన్స్ , బస్ స్టాప్ ఫేమ్ ప్రిన్స్ గుర్తున్నాడా..? ఉండే ఉంటాడులెండి.. ఎందుకంటే సినిమాలు పోతోన్న టైమ్ లో మనోడు బిగ్ బాస్ సీజన్ వన్ లో హల్చల్ చేశాడు కదా.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ కు అప్పట్లో మారుతి తరహా సినిమాలతో మంచి గుర్తింపే వచ్చింది. కానీ ఆ సక్సెస్ ఎక్కువ సినిమాలకు నిలవలేదు. దీంతో నేను శైలజ వంటి సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో కూడా నటించాడు. అనుకోకుండా బిగ్ బాస్ సీజన్ వన్ లోకి ఎంటర్ అయి అందర్నీ ఆశ్చర్యపరిచిన ప్రిన్స్.. ఆ తర్వాత మళ్లీ ఏ కొత్త సినిమాలోనూ కనిపించలేదు. మరి ఇన్నాళ్లూ అతను ఏం చేశాడో తెలుసా.. మీరు చూస్తోన్న ఆస్టిల్ ఉందే.. అలా మారడానికి కష్టపడ్డాడన్నమాట. మొత్తంగా అదిరిపోయే రేంజ్ లో బాడీని షేప్ చేసుకుని ఏకంగా సిక్స్ ప్యాక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడీ కుర్రాడు. 

గతంలో ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ అనే సినిమా చేసిన ఏ సుశాంత్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాతో ప్రిన్స్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా కోసమే ఈ సిక్స్ ప్యాక్ అని కూడా వినిపిస్తోంది. ఇక రొమాన్స్ అనే సినిమాలో మనోడు ఎంత రొమాన్స్ చేశాడో తెలుసు కదా.. ఆ ఇమేజ్ పోకుండా ఈ సినిమాలో ఏకంగా నలుగురు భామలతో రొమాన్స్ చేయబోతున్నాడట. అన్నట్టు ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది అంటున్నారు. మొత్తంగా ఎప్పుడూ చాక్టెట్ బాయ్ లా కనిపించే ప్రిన్స్ ఇలా ఒక్కసారిగా రగ్గ్ డ్ లుక్ తో సిక్స్ ప్యాక్ లో కనిపించి చిన్నపాటి షాక్ ఇచ్చాడనే చెప్పాలి. 

More Related Stories