English   

కన్ను కొట్టింది.. కోటి పట్టింది..

priyaprakash

కన్ను కొట్టింది కోటి పట్టింది. ఓస్ ఆ మాత్రం కన్ను మేం కొట్టలేమా అనుకుంటున్నారేమో.. అందరూ ఈ భామలా కొట్టలేరు. ఆమె కళ్లకు ఎంటైర్ నేషన్ ఓవర్ నైట్ ఫిదా అయిపోయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఆ కళ్లకు పడిపోయారు. కొన్నాళ్ల క్రితం ఓ మళయాల సినిమా పాటలో చిన్న బిట్ లో వచ్చిన ఈ భామ కలువ కళ్ల ఎక్స్ ప్రెషన్ కు దేశవ్యాప్తంగా కోట్లమంది పడిపోయారు. తనే ప్రియా ప్రకాష్ వారియర్.. మళయాలంలో రూపొందుతోన్న ‘ఒరు ఆదార్ లవ్’ అనే సినిమాలో ఓ పాటలో వచ్చే ఈ బిట్ తనకు ఎంతో పేరు తెచ్చింది. అప్పటి నుంచి నేషనల్ మీడియాలో హాట్ సెలబ్రిటీ అయిపోయిందీ బ్యూటీ. నిజానికి ఈ సినిమాలో తను హీరోయిన్ కాదు. చిన్న పాత్ర. తనకు వచ్చిన గుర్తింపుతో ఆపాత్రను పెంచాడు దర్శకుడు. ఇక తర్వాత వరుసగా అవకాశాలూ అందిపుచ్చుకుంటోంది.

అటు సోషల్ మీడియాలోనూ ఓవర్ నైట్ అమ్మడికి లక్షల్లో అభిమానులు చేరిపోయారు. దీంతో సోషల్ మీడియాలో తను ఏదైనా ప్రొడక్ట్ ను ప్రమోట్ చేయాలంటే కూడా లక్షల్లో రెమ్యూనరేషణ్ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రియకు ఇప్పుడు కళ్లు చెదిరే ఆఫర్ వచ్చింది. లేటెస్ట్ గా ప్రియకు ఓ యాడ్ కోసం భారీ ఆఫర్ వచ్చింది. ఇందుకోసం తనకు ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఓ జాతీయస్థాయి ఉత్పత్తి ప్రచారం కోసం తనను తీసుకున్నారు. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా ఆ కంపెనీ తనకు కోటి ఇవ్వబోతోందట. మరి ఇందులో వాస్తవమెంత ఉందో కానీ.. ప్రస్తుతం తను ఆ యాడ్ కు సంబంధించిన షూటింగ్ లో ఉన్న ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా లక్ అంటే అలా ఉండాలి మరి. 
 

More Related Stories