English   

వారియ‌ర్ మ‌ళ్లీ క‌న్నుగొట్టిందే..!

Priya-Varrier
2018-05-19 16:25:56

ఒక్క‌సారి క‌న్ను కొట్టినందుకే ఇండియా అంతా ఆమె జ‌ప‌మే చేసింది. ప్రియా వారియ‌ర్ అంటే ఇప్పుడు తెలియ‌ని వాళ్లంటూ ఉండ‌రు. అంత‌గా ఫేమ్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఒక్క చిన్న వీడియోతో వైర‌ల్ అయిపోయింది. సెలెబ్రెటీస్ కు కూడా ఎంతో క‌ష్ట‌ప‌డితే రాని స్టార్ డమ్.. చాలా త‌క్కువ టైమ్ లో సంపాదించుకుంది ప్రియా. ఈమెను ఏకంగా నేష‌న‌ల్ ఛానెల్స్ కూడా కూర్చోబెట్టి స్టార్ గా మార్చేసాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో నుంచి మ‌రో పాట విడుద‌లైంది. అది కూడా నిమిషం పాటు సాగే పాట‌. ప్రియా వారియ‌ర్ ఒరు అడార్ ల‌వ్ సినిమాలో న‌టిస్తుంది. డిగ్రీ చేస్తోన్న ఈ అమ్మాయి.. చదువుకుంటూనే ఈ సినిమాలో న‌టించింది. ఇప్పుడు విడుద‌ల‌కు ముందే ప్రియా పుణ్య‌మా అని ఈ చిత్రం రేంజ్ ఎక్క‌డికో వెళ్లింది. ఈ చిత్రంలోని కొత్త పాట‌ను విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో కూడా కేవ‌లం ఎక్స్ ప్రెష‌న్స్ తోనే చంపేసింది ఈ ముద్దుగుమ్మ‌. సెప్టెంబ‌ర్ లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి విడుద‌ల‌కు ముందే ప‌రిస్థితి ఇలా ఉంటే.. రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత ప్రియా కోసం యూత్ చ‌చ్చిపోతారేమో..? 

More Related Stories