English   

ఆ బ్యూటీని ఇంటి నుంచి వెళ్లగొట్టారు

priya-prakash
2018-02-13 18:41:52

లక్.. ఎప్పుడు ఎవరికి ఎలా చిక్కుతుందో చెప్పలేం. కానీ అదృష్టం సునామీలా చుట్టుకోవడం అనేమాటకు అక్షర రూపం ప్రియా ప్రకాష్ వారియర్. డిజిటల్ మీడియాలో ఈ బ్యూటీ చేస్తోన్న సంచలనం అంతా ఇంతా కాదు. క్షణాలు మాత్రమే కనిపించిన ఓ చిన్నవీడియోతో ఈ చిన్నది ఇప్పుడు ఎంతోమందికి కునుకు లేకుండా చేసింది. అదే ఇప్పుడీ భామను ఇంటి నుంచి వెళ్లగొట్టేలా చేసింది. అసలు ఈ బ్యూటీ నేపథ్యమేంటో ఓ సారి చూద్దాం. 

ప్రియ ప్రకాశ్‌ వారియర్‌..ఈ మలయాళీ భామ తన చూపుతో యువకుల గుండెల్ని పిండేస్తోంది. ప్రియ ఓ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఒరు అదర్‌ లవ్‌’ చిత్రంలోని ‘మణిక్య మలరాయ’ అనే పాటలో ఆమె కళ్లతో పలికించిన హావభావాలు మాటలకు అందనివి. ఇప్పటికే ఈ వీడియోను 45 లక్షల మందికి పైగా వీక్షించారు. 27 సెకన్లలోనే సోషల్‌మీడియాలో సంచలనం  సృష్టించిందీ చిన్నది. ఆమెపలికించిన హావభావాలతో.. నెటిజన్లకు తనిప్పుడు సోషల్‌మీడియా స్టార్‌ అయిపోయింది. యూట్యూబ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఇలా అన్ని సామాజిక అనుసంధాన వేదికలూ ఆమె పేరును జపించేలా చేశాయి. 

ఇక యూట్యూబ్‌లో అయితే రెండు రోజుల నుంచి మొదటి స్థానంలో ట్రెండ్‌ అవుతోంది.ఊహించని రీతిలో వస్తున్న ఈ స్పందనకు ప్రియ తబ్బిబ్బవుతోంది. అయితే ఇదే ఇప్పుడీ బ్యూటీకి కొత్త చిక్కులు తెచ్చింది. తనకు వస్తోన్న క్రేజ్ తో మీడియా ఇంటర్వ్యూస్ కోసం ఎగబడుతోందట.దీంతో ఆమె తల్లి ప్రియను ఇంట్లో నుంచి పంపించివేసిందట. అంటే సీరియస్ గా కాదు.. ఈ హడావిడీ తగ్గేంత వరకూ ప్రియను హాస్టల్ లో చేర్పించారట. తను అక్కడి నుంచే షూటింగ్స్ కు వెళుతుందట. ప్రియ ప్రస్తుతం త్రిస్సూర్‌లో డిగ్రీ చదువుకుంది. శాస్త్రీయ నృత్యం మోహిని ఆట్టంలోనూ ట్రెయినింగ్ తీసుకుంది.

More Related Stories