English   

కన్ను కొట్టిన పిల్లకు రెండు కోట్లా..?

Priya Prakash Varrier

వై దిస్ కొలవెరి తర్వాత ఓ సౌత్ మూవీ దేశవ్యాప్తంగా(బాహుబలి మినహాయించి) సంచలనం సృష్టించింది మాత్రం ఒరు ఆదార్ లవ్. ఈ మూవీలోని ఓ పాటలో కేవలం 27సెకన్ల పాటు కనిపించిన ఓ చిన్న వీడియో బిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్షేషన్ అయింది. ఆ బిట్ లో కనిపించిన నటి ప్రియా వారియర్ పలికించిన హావభావాలకు ఆల్మోస్ట్ కంట్రీయే ఫిదా అయిపోయింది. ఇక స్టార్స్ కూడా ఈ వీడియోపై ట్వీట్స్ వేస్తూ మరింత హైప్ పెంచారు. నిజానికి ఇలాంటివి వెరీ రేర్ గా జరుగుతుంటాయి. అందుకే ఆ భామకోసం ఇతర రాష్ట్రాల నిర్మాతలు ఎగబడుతున్నారిప్పుడు. ఇదే అదనుగా ఆ మూవీ నిర్మాత అదిరిపోయే కాస్ట్ చెప్పేస్తున్నాడు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. దేశవ్యాప్తంగా భాషతో పనిలేకుండా ఫిదా చేసిన ఈ భామ నటిస్తోన్న సినిమాకు ఆల్రెడీ కంట్రీ వైడ్ గా బిగ్ బజ్ వచ్చేసింది. దాన్ని క్యాష్ చేసుకోవాలని కొందరు నిర్మాతలు ఒరు ఆదార్ లవ్ చిత్ర డబ్బింగ్ రైట్స్ అడుగుతున్నారట. కానీ ఒరిజినల్ నిర్మాత ఓసేపచ్చన్ ఒలకుళ్లి మాత్రం ఇదే అదను అని ఏకంగా రెండు కోట్లు చెప్పాడట. ఇది ఓ తెలుగు నిర్మాతకే ఎదురైన అనుభవం. నిజం.. దీంతో సదరు నిర్మాత షాక్ తో తిరిగి వచ్చాడట. తెలుగే కాదు సౌత్ లోని ఇతర భాషా నిర్మాతలు, అటు నార్త్ వాళ్లు వళ్లినా ఆ నిర్మాత అదే రేట్ చెబుతున్నాడట. దీంతో చాలామంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. కన్ను కొట్టి గన్నుతో కిస్ పెట్టి కవ్వించింది కదాని వీళ్లు వెళితే ఆ నిర్మాత మాత్రం వీరి పాకెట్ పై గన్ పెట్టినంత పని చేస్తున్నాడట. నిజానికి ఓ  మళయాల సినిమాకు రెండు కోట్ల డబ్బింగ్ రేట్స్ అంటే అది వెరీ హై ప్రైస్. పైగా ఆ సినిమాలో ఏ స్టార్ కాస్ట్ కూడా లేదు. కేవలం ఈ కన్నుకొట్టి గన్ను పట్టిన పిల్లే క్రేజ్. కానీ ఆ క్రేజ్ రెండుకోట్లు పెట్టి కొన్ని డబ్బింగ్ సినిమాను మోసేంతగా నిలబెడుతుందా అంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయినా మళయాల సినిమా డబ్బింగ్ రేట్ రెండు కోట్లేంటీ మరీ కాకపోతే. 

More Related Stories