English   

కుర్రోడు ఓ ఇంటి వాడైపోయాడు..

Priyadarshi marriage
2018-03-05 17:49:32

నా చావు నేను స‌స్తా నీకెందుకు.. ఈ డైలాగ్ విన‌గానే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రియ‌ద‌ర్శి. రెండేళ్లుగా టాలీవుడ్ ను ఊపేస్తున్నాడు ఈ కుర్రాడు. పెళ్లిచూపులు సినిమాలో కౌశిక్ కారెక్ట‌ర్ తో అంద‌రికీ క‌నెక్ట్ అయిపోయాడు ద‌ర్శి. ఇప్పుడు చిన్న హీరోల నుంచి స్టార్స్ వ‌ర‌కు అంద‌రికీ దోస్త్ అంటే ముందుగా గుర్తొచ్చేది ద‌ర్శినే. షార్ట్ ఫిల్మ్స్ నుంచి వ‌చ్చిన ఈ కుర్రాడు.. పెళ్లిచూపులు సినిమాతో స్టార్ అయిపోయాడు. త‌ర్వాత వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ మ‌ధ్యే స్పైడ‌ర్.. ఎంసిఏ.. మొన్న విడుద‌లైన తొలిప్రేమ‌ లాంటి సినిమాల్లో న‌టించాడు. తెలంగాణ నేప‌థ్యంలో వ‌చ్చే సినిమాల‌కు ఈయ‌న త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేకుండా పోతుంది. దానికి తోడు ఫ్రెష్  ఫేస్ కావ‌డంతో ప్రియ‌ద‌ర్శికి ఆఫ‌ర్లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఇదే జోరు మ‌రికొంత కాలం కొన‌సాగిస్తే తెలుగులో క‌మెడియ‌న్ గా త‌న స్థానం ప‌దిలం చేసుకుంటాడు ఈ కుర్రాడు. 

ఇండ‌స్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ క‌మెడియ‌న్ గా మారుతున్న ప్రియ‌ద‌ర్శి.. రియ‌ల్ లైఫ్ లోనూ మ‌రో మెట్టు పైకి ఎక్కేసాడు. ఈయ‌న పెళ్లి ఫిబ్ర‌వ‌రి 23న హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఫిబ్ర‌వ‌రి 26న హైదరాబాద్‌లో వివాహ విందును ఏర్పాటు చేశారు. దీనికి పలువురు సినీ ప్రముఖులు హాజరై.. నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. అయితే ఈయ‌న పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టికి రాలేదు. ఇప్పుడు త‌నే ప్ర‌త్యేకంగా ఓ ఫోటో తీసి ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసాడు ద‌ర్శి. పెళ్లి పీటలపై ఉన్న రిచా శర్మ.. ప్రియదర్శిపై తలంబ్రాలు పోస్తున్న ఫోటో ఇది. దీనికి నెటిజ‌న్ల నుంచి కూడా ఆస‌క్తిక‌ర‌మైన క‌మెంట్స్ వ‌స్తున్నాయి. ఎనీ వే.. హ్యాపీ మ్యారిడ్ లైఫ్ ప్రియ‌ద‌ర్శి. 

More Related Stories