English   

పెళ్ళయిన మూడో రోజే ప్రియమణి చేసిన పనికి షాకయిన భర్త 

Priyamani
2020-08-10 16:47:22

టాలీవుడ్‌ లో ఫేడవుట్ అయిన హీరోయిన్స్ అందరూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. యమదొంగ, పెళ్ళైన కొత్తలో లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఫేడవుట్ అయిన ప్రియమణి సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన తర్వాత సినీ సెలబ్రిటీలు హనీ మూన్ లాంటివి ప్లాన్ చేసుకుంటారు. కానీ ప్రియమణికి మాత్రం పెళ్లి తర్వాత అలాంటి వెకేషన్ కు వెళ్ళే అవకాశం రాలేదట. పెళ్లయ్యేనాటికి షూటింగ్ లతో బిజీగా ఉన్న ఆమె పెళ్లయిన మూడోరోజే తాను షూటింగ్ కి బయలుదేరానని చెప్పింది ప్రియమణి. 

లాక్ డౌన్ వచ్చే వరకు ఎక్కువగా తన భర్తతో గడిపే అవకాశం ఆమెకు రాలేదని అంటోంది. ఇక ఈమె రానా నటించబోయే విరాటపర్వం 1992 అనే సినిమా ద్వారా వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుంది. నీదీ నాదీ ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చెయ్యనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా, నటి ప్రియమణి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు మానవ హక్కుల కోసం పోరాటం చేసే మహిళ పాత్రని పోషిస్తున్నట్టు సమాచారం. సాయి పల్లవి నక్సలైట్‌గా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉంది. ఇక ఈ సినిమా కాక ఆమె నారప్పలో వెంకటేష్ కి జంటగా నటిస్తోంది.  

More Related Stories