English   

ప్రియాంక ఇక బ్యాగ్ సర్ధుకున్నట్టేనా..?

priyanka get back to bollywood for krish-4

డస్కీ బ్యూటీ ప్రియంక చోప్రా.. బోలెడన్ని హాలీవుడ్ డ్రీమ్స్ తో వెళ్లింది. డ్రీమ్స్ కు తగ్గట్టుగా ఆఫర్స్ అయితే వచ్చాయి కానీ.. రిజల్ట్స్ రాలేదు. తను నటించిన టివి సిరీస్ షో క్వాంటికో అక్కడ ఈ సారి డిజాస్టర్ అయింది. పైగా ప్రియాంక ఊహించనంత హాట్ గా నటించింది కూడా. అయినా ఆ షో ఫ్లాప్ కావడం తనకుషాక్ ఇచ్చింది. ఈ లోగా ఓ రెండు మూడు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ పట్టినా అవేవీ అంతగా వర్కవుట్ అయ్యే అవకాశాలు లేవు. ఈ టైమ్ లో ప్రియాంకకు ఓ సర్ ప్రైజింగ్ ఆఫర్ డేట్స్ తట్టింది. ఇక హాలీవుడ్ లో ఆల్మోస్ట్ బ్యాగ్ సర్దేసుకుంటోన్న టైమ్ లో తనకిది లక్కీ ఆఫర్ అనే చెప్పాలి. 

బాలీవుడ్ హిట్ సిరీస్ లో ఫస్ట్ ఉండేది క్రిష్. హృతిక్ రోషన్ హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ కు మనోళ్లు ఫిదా అయ్యారు. మూడో భాగం కాస్త నిరాశపరిచిన.. ఓవరాల్ గా ఓకే. ఈ మూడు భాగాల్లోనూ ప్రియాంకనే హీరోయిన్. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. ఆశ్చర్యంగా ఈ ఫోర్త్ సిరీస్ లోనూ ప్రియాంకనే తీసుకుంటోంది టీమ్. ఇప్పటి వరకూ తను ఉండి సడెన్ గా తీసేస్తే బావుండదు. పైగా తన పాత్రకూ సినిమాలో మంచి ప్రియారిటీ ఉంది. అలాంటప్పుడు ఎలా తీసేస్తాం అంటున్నాడు దర్శకుడు  రాకేశ్ రోషన్. ప్రస్తుతం హృతిక్ సూపర్ -30 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే క్రిష్-4 స్టార్ట్ అవుతుంది. వచ్చే యేడాది విడుదల చేసేలా ప్లానింగ్ పూర్తయింది. మరి ఈ సినిమాతో ప్రియాంక మళ్లీ బాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి. 

More Related Stories