English   

 జ్వాల ర‌గిలిస్తున్న‌ ప్రియాంక జ‌వాల్క‌ర్.. 

Priyanka-jawalkar

ప్రియాంక జ‌వాల్క‌ర్.. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ ఇప్పుడు ఈమె అందాల జ్వాల మాత్రం టాలీవుడ్ లో ర‌గల‌డానికి రెడీగా ఉంది. పేరుకు త‌గ్గ‌ట్లే మంట‌లు పుట్టిస్తుంది ప్రియాంక జ‌వాల్క‌ర్. ప్ర‌స్తుతం ఈమె చేసిన ఫోటోషూట్ కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్టించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా ఇప్పుడు ప్రియాంక అందాల‌కు తెలుగులో క్రేజ్ పెరిగిపోయింది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న ట్యాక్సీవాలా సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది ప్రియాంక‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో ప్రియాంక బాగానే అందాలు ఆర‌బోసింద‌ని అర్థ‌మైపోతుంది. ఇక ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో హాట్ ఫోటోషూట్ ఒక‌టి విడుద‌లైంది. ఇందులో అమ్మాయిగారి ర‌చ్చ చూసి అబ్బోఅనుకోవాల్సిందే. థైస్ చూపిస్తూ బాగానే రెచ్చ‌గొట్టింది ప్రియాంక‌. ఇది చూసిన త‌ర్వాత ఏ నిర్మాతైనా ఇట్టే త‌న సినిమాలో పిలిచి మ‌రీ ప్రియాంకు అవ‌కాశం ఇచ్చేస్తాడు అంత‌గా త‌న అందంతో మాయ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి జవాల్క‌ర్ అని పేరులో పెట్టుకున్నా.. దాన్ని కాస్త మార్చి జ్వాల ర‌గిలిస్తుంది ప్రియాంక‌. 
 

More Related Stories