English   

కరోనా నుంచి బయటపడిన బండ్ల గణేష్.. ఇదిగో సాక్ష్యం..

Bandla Ganesh
2020-07-02 06:47:03

తెలుగు ఇండస్ట్రీలో కరోనా వైరస్ వచ్చిన మొదటి సెలబ్రిటీ బండ్ల గణేష్. ఈ నిర్మాత కం కమెడియన్ మొన్న మధ్య హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ వైద్యులు కరోనా టెస్ట్ చేయించాలని కోరారు. అలా టెస్ట్ చేసుకుంటే ఊహించని విధంగా బండ్ల గణేష్ కు పాజిటివ్ వచ్చింది. దాంతో వెంటనే ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. తాజాగా ఈయన కరోనా వైరస్ నుంచి బయటపడ్డాడు. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బండ్ల గణేష్. తాను ఈ వైరస్ నుంచి పూర్తిగా కోరుకున్నట్లు అభిమానులకు తెలిపాడు. 

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని ఎలాంటి సమస్య లేదు అంటున్నాడు ఈయన. దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు బండ్ల గణేష్. ఈయన తర్వాత టాలీవుడ్ లో ఇంకా చాలా మందికి కరోనా వైరస్ వచ్చింది. సమంతా స్నేహితురాలు శిల్పా రెడ్డి, ఆమె భర్త కూడా ఈ వైరస్ బారిన పడి మళ్ళీ బయటపడ్డారు. ఇక సీరియల్ ఆర్టిస్టులకు వరుసగా కరోనా వైరస్ అటాక్ అవుతుంది. షూటింగ్ లు నిలిపివేయక పోవడంతో ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే తెలుగు టీవీ సీరియల్స్ లో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా చాలామంది టెస్టులు చేయించుకుంటున్నారు. వాళ్ల రిపోర్టులు రావాల్సి ఉంది. ఏదేమైనా కూడా తెలుగు ఇండస్ట్రీని కరోనా వైరస్ అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. 

More Related Stories