English   

నిర్మాత ప్రభాకర్ హఠాన్మరణం

donkeswara Prabhakar died
2018-02-25 15:20:21

తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.  నిర్మాత డొంకేశ్వర ప్రభాకర్ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా కామారెడ్డి వద్ద ఉన్న డొంకేశ్వరం. 80లలో తెలుగు సినిమా పరిశ్రమలోకి నిర్మాతగా ప్రవేశించారు ప్రభాకర్. ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ ను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. నాగబాబుకు ఇన్సియల్ డేస్ లో మంచి ఇమేజ్ తెచ్చిన భగవాన్ ఈయన నిర్మించిందే. కృష్ణంరాజు మరో హీరోగా నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అలాగే శారద కెరీర్ లో ఒన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ గా చెప్పుకునే నాయకురాలు నిర్మాత కూడా ప్రభాకరే. ఈ సినిమాలోని వందేమాతరం.. ఇది మా నవతరం అనే పాట ఇప్పటికీ గ్రామాల్లో మార్మోగుతూనే ఉంటుంది. నరేష్, వాణీవిశ్వనాథ్ జంటగా ప్రేమ చిత్రం- పెళ్లి విచిత్రం(1993), జె.డి. చక్రవర్తి, మహేశ్వరి జంటగా వచ్చిన మృగం(1996) తో పాటు ప్రియురాలు అనే సినిమానూ ఈయన నిర్మించారు.

కొంతకాలంగా చిత్రపరిశ్రమకు, నిర్మాణానికి దూరంగా కామారెడ్డిలో నివాసం ఉంటోన్న ప్రభాకర్ ఉదయం 8.59నిమిషాలకు గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.. తెలుగు పరిశ్రమకు మళ్లీ వరుస మరణాల భీతి మొదలైంది. మొన్న కృష్ణకుమారి నిన్న గుండు హనుమంతరావు.. ఇవాళ శ్రీదేవి, డొంకేశ్వర ప్రభాకర్.. శ్రీదేవి మరణం వ్యాపించినంతగా ఈ నిర్మాత గురించి చాలామందికి ఎక్కువగా తెలియకపోవడానికి కారణం ఆయన సినిమా పరిశ్రమకు దూరంగా ఉండటమే అంటున్నారు. ఏదేమైనా నిర్మాత ప్రభాకర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది సినిమా పాలిటిక్స్..

More Related Stories