English   

ఆ నిర్మాతను నిండా ముంచిన స్టార్ హీరో

Producer loss by star hero

నిర్మాత హ్యాపీగా ఉంటనే పరిశ్రమ పచ్చగా ఉంటుంది. ఆ నిర్మాతను హ్యాపీగా ఉంచాల్ని హీరోలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఇప్పటికి అతనే లాస్ అయినా.. అది పరిశ్రమ మనుగడకే ప్రమాదం. ఇప్పుడు ఓ స్టార్ హీరో నటించిన కొత్త సినిమా విడుదలైంది. టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా నేలబారుగా ఉందనే టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంటే పాపం ఆ నిర్మాతను వీళ్లెంత మోసం చేశారా అనిపిస్తుంది. అంతే కాదు.. రెండు సినిమాలు మాత్రమే తీసిన ఈ చిత్ర దర్శకుడు ఏకంగా 5కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. ఐదు కోట్లు తీసుకున్న ఆ దర్శకుడు కనీసం తన రెమ్యూనరేషన్ లో వెయ్యోవంతు కూడా ఈ కథకు న్యాయం చేయలేకపోయాడు. అటు హీరో కూడా వరుస ఫ్లాపుల్లో ఉన్నా.. ఏకంగా 10కోట్లు తీసుకున్నాడు. దీంతో ఈ నిర్మాతకు ఈ ఇద్దరి వల్లే 15కోట్లు పోయింది. ఇక మేకింగ్ పరంగానూ తెరంగా విపరీతమైన ఆర్టిస్టులను తీసుకుని.. ఎవరికీ సరైన పాత్ర లేకున్నా.. సినిమా ఆసాంతం ఉంచేసి.. ఆనిర్మాతను ఆ రకంగానూ మోసం చేశారంటున్నారు.  

ఈ వ్యవహారంలో మరో కోణం ఏంటంటే.. సినిమా ఏమైనా ఫర్వాలేదు.. నాకు ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే వారికే నా కాల్షీట్స్ అనేది హీరోగారి కొత్త సూత్రం అంటున్నారు. ఆ సూత్రం ప్రకారమే పదికోట్లిచ్చారని.. కథ గురించి కనీస చర్చలు లేకుండా బ్లైండ్ గా వెళ్లిపోయాడట. దీనివల్ల ఆ హీరోకు వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఎలాగూ కెరీర్ హీరోగా క్లైమాక్స్ లో ఉంది. ఇటు దర్శకుడు మరో రెండేళ్లు ఖాళీగా ఉన్నా నష్టం లేదు. కానీ నిర్మాత మాత్రం నిండా మునిగిపోయాడు. అసలే ఈ నిర్మాత గత సినిమా ఏకంగా 15కోట్ల నష్టాన్ని తెచ్చింది. ఈ సినిమా అంతకు మించి లాస్ అయ్యేలా ఉందంటోంది ట్రేడ్. ఏదేమైనా సినిమా తప్ప మాకేం తెలియదు అని పైగా చెప్పుకునే కొందరు స్టార్స్ .. నిర్మాతల పట్ల మరీ ఇంత నిర్ధాక్ష్యిణ్యంగా ఉండటం వారి క్యారెక్టర్ లోని మరో కోణం. ఇలాంటి వారి వల్ల కొత్త సినిమాలు రావు.. కొత్త నిర్మాతలూ రాలేరు. ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు కానీ.. నిర్మాతను చిన్న చూపు చూస్తే ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సి ఉంటుందని ఆ నిర్మాత సన్నిహితులు కొందరు తిట్టిపోస్తున్నారు.  

More Related Stories