English   

నిర్మాతల మధ్య వివాదం ఒకరిపై మరొకరు కేసు

natti Kumar
2020-10-01 16:46:53

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు నిర్మాతలు ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. నిర్మాత చంటి అడ్డాల తనకు "అయినా నువ్వంటే ఇష్టం" అనే సినిమాను తనకు అమ్మాడని తనతోపాటు మరో ముగ్గురికి అదే సినిమాను అమ్మాడని నిర్మాత నట్టి కుమార్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సినిమాకోసం చంటికి చెక్కులు కూడా ఇచ్చానని పేర్కొన్నాడు. ఇంకా పదిరోజుల షూటింగ్ ఉందని ప్రస్తుతం కీర్తి సురేష్ డిమాండ్ పెరిగిందని అందువల్ల పేమెంట్ చేయలేకే సినిమాను అమ్మేశాడని పేర్కొన్నాడు. ఇక ఇదే ఘటనపై చంటి అడ్డాల నట్టి కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సినిమా కొంటానని నట్టి కుమార్ డబ్బులు ఇవ్వలేదని ఆరోపించాడు. చెక్కులు ఇచ్చాడని అయితే ఇప్పుడే ప్రొసీడ్ అవ్వొద్దని చెప్పాడని తెలిపాడు. తమ మధ్య చేసుకున్న అగ్రిమెంట్ ను కూడా ఫిల్మ్ ఛాంబర్ క్యాన్సిల్ చేసిందని తెలిపాడు. అయినా రిలీజ్ చేసిన పోస్టర్ పై నట్టి కుమార్ తన పేరును వేసుకున్నాడని వెల్లడించారు. నట్టి కుమార్ లాంటి ఫ్రాడ్ ను నమ్మడమే తాను చేసిన తప్పు అంటూ మండిపడ్డాడు. పోలీసులు నట్టి కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసాడు.

More Related Stories